Sachin Sahu: వీధుల్లో ఐస్ క్రీమ్స్ అమ్ముతున్న పారా అథ్లెటిక్స్ ఛాంపియన్..

Sachin Sahu selling ice cream: జాతీయ పారా అథ్లెటిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన సచిన్ సాహు ప్రస్తుతం వీధుల్లో ఐస్ క్రీమ్స్ అమ్ముకుంటున్నాడు. ప్రభుత్వం అతన్ని పట్టించుకోకపోవడంతో బతుకు బండి నడిచేందుకు ఐస్ క్రీమ్ బండితో రోడ్డెక్కాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 6, 2022, 01:36 PM IST
  • ఐస్ క్రీమ్స్ అమ్ముకుంటున్న పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ సచిన్ సాహు
  • గతంలో జాతీయ పారా అథ్లెటిక్స్ పోటీల్లో కాంస్యం గెలిచిన సాహు
  • ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఐస్ క్రీమ్స్ అమ్ముకుంటూ జీవనం
Sachin Sahu: వీధుల్లో ఐస్ క్రీమ్స్ అమ్ముతున్న పారా అథ్లెటిక్స్ ఛాంపియన్..

Sachin Sahu selling ice creams: అతనో పారా అథ్లెటిక్స్ ఛాంపియన్... గతంలో జాతీయ పారా అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించాడు.. కానీ ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదరణ లేకపోవడం, ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో ఐస్ క్రీమ్ బండి నడుపుకుంటున్నాడు. ఎటువంటి సదుపాయాలు, ఎవరి సహకారం లేకపోయినా పారా ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తాను... ప్రభుత్వం ముందుకొచ్చి సాయం చేస్తే భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధిస్తానని చెబుతున్నాడు. ఆ ఛాంపియన్ పేరు... సచిన్ సాహు.

మధ్యప్రదేశ్‌కి చెందిన సచిన్ సాహు  ఒడిశాలోని కళింగ స్టేడియంలో జరిగిన 20వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌‌లో సత్తా చాటాడు. 400 మీటర్ల పరుగు పందాన్ని కేవలం 1.15 సెకన్లలో పూర్తి చేసి కాంస్య పతకం సాధించాడు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం సచిన్‌ని పట్టించుకోలేదు. తన ఆర్థిక పరిస్థితి కూడా అంతంతే కావడంతో... బతుకు బండి నడిచేందుకు ఐస్ క్రీమ్ బండితో రోడ్డెక్కాడు. వీధుల్లో తిరుగుతూ ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నాడు. దేశానికి మరిన్ని పతకాలు సాధించే సత్తా ఉన్నా ఆటగాడు.. ఇలా ఐస్ క్రీమ్స్ అమ్ముకోవడం పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.

సచిన్ నిజానికి 2015-2019 వరకు క్రికెట్ ఆడాడు. కానీ దివ్యాంగుడైన కారణంతో అంతగా రాణించలేకపోయాడు. ఈ క్రమంలో గ్వాలియర్‌కి చెందిన అథ్లెటిక్స్ కోచ్ బీకే ధావన్ సాయంతో పారా అథ్లెట్‌గా మారాడు. ఒడిశాలో జరిగిన 20వ పారా అథ్లెటిక్స్‌లో కాంస్యం సాధించాడు. ఇకనైనా ప్రభుత్వం సచిన్‌ను గుర్తించి అతనికి తగిన ప్రోత్సాహం అందించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

స్పెషల్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు సాధించిపెట్టిన అథ్లెట్ సీతా సాహు సైతం సమోసాలు అమ్ముకుంటున్న వైనం ఇటీవల వెలుగుచూసిన సంగతి తెలిసిందే. 2011 ఏథెన్స్ స్పెషల్ ఒలింపిక్స్‌లో సాహు రెండు పతకాలు సాధించింది. కానీ ఆ తర్వాత ప్రభుత్వం ఆమెను పట్టించుకోకపోవడంతో సమోసాలు అమ్ముకుంటూ జీవనం సాగించాల్సిన పరిస్థితి తలెత్తింది. 

Also Read: AVAK Twitter Review: 'అశోక వ‌నంలో అర్జుణ క‌ల్యాణం' రివ్యూ.. ఎలా ఉందంటే?

Also Read: SVP Mass Song: ఫ్యాన్స్‌కి మహేష్ బాబు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌.. అదేంటంటే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News