Rahul Gandhi Bharat Jodo Yatra: వందేళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అత్యంత సంక్లిష్ఠ పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2014 తర్వాత దేశంలో కాంగ్రెస్ ప్రభ క్రమంగా మసకబారుతూ వస్తోంది. ప్రస్తుతం దేశంలో రెండే రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ సీనియర్లు కూడా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటం, నాయకత్వ లేమి కారణంగా పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంగానే కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్‌కు పునర్వైభవం తీసుకురావడం కోసం 'రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర'కు సిద్ధమయ్యారు. తమిళనాడులోని కన్యకుమారి నుంచి జమ్మూకశ్మీర్ వరకు 150 రోజుల పాటు 3500 కి.మీ దూరం సాగే ఈ సుదీర్ఘ యాత్ర నేడే ప్రారంభం కానుంది.
'కలిసి నడుద్దాం.. దేశాన్ని ఏకం చేద్దాం' అనే నినాదంతో రాహుల్ గాంధీ జోడో యాత్ర సాగనుంది. పక్షపాత రాజకీయాలకు, మతోన్మాదానికి, పెరుగుతున్న నిరుద్యోగానికి, అసమానతలకు, జీవనోపాధి విధ్వంసానికి వ్యతిరేకంగా దేశ ప్రజలందరినీ ఏకం చేస్తూ ఈ ర్యాలీ సాగనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ యాత్రకు సంబంధించి ఇప్పటికే ఒక గీతాన్ని కూడా విడుదల చేశారు.
జోడో యాత్ర ప్రారంభానికి ముందు రాహుల్ గాంధీ, శ్రీ పెరంబదూర్‌లోని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మెమోరియల్‌లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం తిరవళ్లూర్ మెమోరియల్, కామరాజ్ మెమోరియల్‌లోనూ ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. కన్యకుమారిలోని మహాత్మాగాంధీ మండపంలో ప్రార్థనల అనంతరం తమిళనాడు సీఎం స్టాలిన్,చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బాఘెల్, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌లతో కలిసి జోడో యాత్రను ప్రారంభిస్తారు. జోడో యాత్రలో దాదాపు 118 మంది కాంగ్రెస్ నేతలు పాల్గొంటారు.
పాదయాత్ర రెండు సెషన్లలో:
రాహుల్ జోడో యాత్ర పేరిట చేపట్టే పాదయాత్ర ప్రతీరోజూ రెండు సెషన్లలో సాగుతుంది. మొదటి సెషన్ ఉదయం 7గం. నుంచి 10 గం. వరకు, రెండో సెషన్ 3.30 గం. నుంచి 6.30 గం. వరకు ఉంటుంది. ఉదయం సెషన్ కన్నా మధ్యాహ్నం సెషన్‌లో జరిగే పాదయాత్రలో ఎక్కువమంది పాల్గొననున్నారు. ప్రతీ రోజూ 22-23 కి.మీ మేర పాదయాత్ర సాగుతుంది. ఓవైపు రాహుల్ పాదయాత్ర కొనసాగుతూనే.. మరోవైపు ఆయా రాష్ట్రాల్లోనూ స్థానిక కాంగ్రెస్ నేతలు యాత్రలు చేపట్టనున్నారు. కన్యాకుమారి నుంచి కొచ్చి, పాలక్కడ్, కోయంబత్తూర్, మైసూరు, బళ్లారి, వికారాబాద్ , నాందేడ్, ఇండోర్, ఉజ్జయిన్, కోటా, అల్వార్, బులంద్ షహర్, ఢిల్లీ, అంబాలా, పఠాన్ కోట్ మీదుగా శ్రీనగర్ వరకు యాత్ర సాగనుంది.
Also Read: NEET UG 2022 Result: నేడే నీట్ యూజీ 2022 ఫలితాలు... విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి...
Also Read: Horoscope Today September 7th 2022: నేటి రాశి ఫలాలు... ఈ రాశి వారి కెరీర్‌లో ఇవాళ కీలక పరిణామం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook