Vikarabad: తెలంగాణలో ముఖ్యమంత్రి సొంత జిల్లా వికారాబాద్ లో కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అధికారులను అక్కడి ప్రజలు పరిగెత్తించి మరి కొట్టారు. అంతేకాదు వారు వచ్చిన వాహనాలను ధ్వంసం చేసారు. ముఖ్యంగా ఫార్మా సిటీ నేపథ్యంలో భూములు కోల్పోయే రైతులు అభిప్రాయాన్ని సేకరించేందుకు వెళ్లిన అధికారులు.. స్థానికంగా భూములు కోల్పోయే రైతులు, సీఎం డౌన్ డౌన్.. కలెక్టర్ డౌన్ డౌన్ అనే నినాదాలు చేశారు.
ఫార్మాసిటీ ఏర్పాటుతో తమ ప్రాంతం కలుషితం అవుతుందన్నారు. ముఖ్యంగా ప్రకృతి, అడవుల్లో జీవించే మాకు.. ఫార్మా సిటీతో చిక్కులు వస్తాయన్నారు. ఈ నేపథ్యంలో వారు ప్రభుత్వ అధికారులపై దాడికి పాల్పట్టు తెలుస్తోంది. తాజాగా వికారాబాద్ జిల్లా కలెక్టర్, అధికారులపై దాడి ఘటనలో పోలీసులు అరెస్ట్ చేయడం మొదలు పెట్టారు.
ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కలెక్టర్ పై దాడి నేపథ్యంలో ఎవరు రైతులను ముందుండి నడిపించారనే దానిపై ఆరా తీసి అర్ధరాత్రి వరకు 28 మందిని అరెస్ట్ చేశారు. వారందరినీ పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైతుల అరెస్ట్ నేపథ్యంలో కొడంగల్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ముందస్తుగా ఇంటర్నెట్ నిలిపివేశారు. ముఖ్యంగా దాడి జరిగిన లగచర్ల గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో తమ హక్కుల కోసం పోరాడుతున్న తమపై ప్రభుత్వ అధికారులే ముందుగా దురుసుగా ప్రవర్తించిన విషయాన్ని ప్రస్తావించారు. ఫార్మా కోసం భూములు వద్దన్నందుకే ప్రభుత్వం తమపై కక్ష్య కట్టిందన్నారు.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.