India Covid-19 Update: దేశంలో తగ్గుతున్న కొవిడ్ కేసులు...500 రోజులు పూర్తి చేసుకున్న టీకా పంపిణీ!

India Covid-19 Update: దేశంలో కొత్తగా 2,338 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ తో మరో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా టీకా పంపిణీ నిర్విరామంగా కొనసాగుతోంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : May 31, 2022, 09:49 AM IST
India Covid-19 Update: దేశంలో తగ్గుతున్న కొవిడ్ కేసులు...500 రోజులు పూర్తి చేసుకున్న టీకా పంపిణీ!

India Covid-19 Update: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా  2,338 మందికి వైరస్ పాజిటివ్ (Today Corona Cases in India) గా నిర్ధారణ అయింది. వైరస్ తో మరో 19 మంది ప్రాణాలు  కోల్పోయారు. తాజాగా మరో 2,134 మంది కొవిడ్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో రోజువారీ పాజిటివీ రేటు (Daily positivity rate ) 0.64 శాతంగా నమోదైంది. 

ఇప్పటివరకు కోలుకున్న వారి మెుత్తం సంఖ్య 4,26,15,574గా ఉంది. దేశంలో ఇప్పటివరకు నమోదైన మెుత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,58,087 కాగా...టోటల్ మరణాల సంఖ్య  5,24,630గా నమోదైంది. దేశవ్యాప్తంగా 17,883 కొవిడ్ యాక్టివ్ (Active Cases in India) కేసులున్నాయి. నిన్న ఒక్కరోజే ఒక్కరోజే 3,63,883 మందికి కరోనా పరీక్షలు చేశారు. 

దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ మెుదలై 500 రోజులు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది.  సోమవారం మరో 13,33,064 మందికి టీకాలు (Covid-19 Vaccination in India) అందించారు.  దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన మెుత్తం టీకా డోసుల సంఖ్య 1,93,45,19,805కు చేరింది. 

Also Read: UPSC Results 2021: సివిల్స్‌ ఫలితాల్లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు వీరే..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News