Flash: కరోనా కాటుకు మరొకరు బలి.. 12కి చేరిన మృతుల సంఖ్య

భారత్‌లో కరోనావైరస్ కాటుకు మరొకరు బలయ్యారు. గుజరాత్‌లోని అహ్మెదాబాద్‌లో కరోనావైరస్ బారినపడిన 85 ఏళ్ల వృద్ధురాలు బుధవారం రాత్రి మృతిచెందారు. ఈ వృద్ధురాలి మరణంతో భారత్‌లో కరోనావైరస్‌తో బాధపడుతూ మృతి చెందిన వారి సంఖ్య 12కి చేరింది.

Last Updated : Mar 26, 2020, 12:45 AM IST
Flash: కరోనా కాటుకు మరొకరు బలి.. 12కి చేరిన మృతుల సంఖ్య

అహ్మెదాబాద్: భారత్‌లో కరోనా వైరస్ (Coronavirus) కాటుకు మరొకరు బలయ్యారు. గుజరాత్‌లోని అహ్మెదాబాద్‌లో కరోనావైరస్ బారినపడిన 85 ఏళ్ల వృద్ధురాలు బుధవారం రాత్రి మృతిచెందారు. ఈ వృద్ధురాలి మరణంతో భారత్‌లో కరోనా వైరస్తో బాధపడుతూ మృతి చెందిన వారి సంఖ్య (COVID-19 death toll in India) 12కి చేరింది. గుజరాత్‌లో కరోనా వైరస్‌తో ఇదివరకే ఒకరు కరోనాతో  మృతి చెందగా.. బుధవారం అహ్మెదాబాద్‌లో కన్నుమూసిన వృద్ధురాలిది రెండో కేసుగా అక్కడి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

Read also : Coronavirus alert: తెలంగాణలో 3 ఏళ్ల బాబుకు కరోనావైరస్!

ఇటీవలే విదేశాలకు వెళ్లొచ్చిన ఈ వృద్ధురాలు కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలతో మార్చి 22న ఆసుపత్రిలో చేరారు. కరోనావైరస్‌తో మృతి చెందిన ఈ వృద్ధురాలు మరెన్నో ఇతర శారీరక రుగ్మతలతో బాధపడుతున్నట్టు గుజరాత్ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతకంటే ముందుగా మార్చి 22న సూరత్‌లో తొలి కరోనా మృతి కేసు నమోదైంది. సూరత్‌లో చనిపోయిన 67 ఏళ్ల వృద్ధురాలిదే గుజరాత్‌లో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు మృతిగా గుజరాత్ ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

Read also : లాక్‌డౌన్ 21 రోజులు అందుబాటులో ఉండే సర్వీసులివే

ఇక తమిళనాడులోనూ బుధవారం తొలి కరోనా పాజిటివ్ కేసు మృతి చోటుచేసుకుంది. మధురైలో బుధవారం 54 ఏళ్ల వృద్ధుడు కరోనాతో చనిపోయిన సంగతి తెలిసిందే. తమిళనాడులో కరోనా వైరస్తో మృతి చెందిన వారిలో ఈయనే తొలి వ్యక్తిగా అక్కడి వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News