చికిత్స తీసుకుంటున్న Coronavirus రోగిపై లైంగిక వేధింపులు

దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోని గ్రేటర్ నొయిడాలో దారుణం చోటుచేసుకుంది. కరోనావైరస్ పాజిటివ్‌తో బాధపడుతూ చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఓ 20 ఏళ్ల యువతిని అదే ఆస్పత్రిలో పనిచేస్తోన్న శానిటేషన్ వర్కర్, స్టోర్స్ ఇంచార్జ్ కలిసి లైంగిక వేధింపులకు ( Sexually assaulted ) పాల్పడ్డారు.

Last Updated : May 7, 2020, 11:27 PM IST
చికిత్స తీసుకుంటున్న Coronavirus రోగిపై లైంగిక వేధింపులు

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోని గ్రేటర్ నొయిడాలో దారుణం చోటుచేసుకుంది. కరోనావైరస్ పాజిటివ్‌తో బాధపడుతూ చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఓ 20 ఏళ్ల యువతిని అదే ఆస్పత్రిలో పనిచేస్తోన్న శానిటేషన్ వర్కర్, స్టోర్స్ ఇంచార్జ్ కలిసి లైంగిక వేధింపులకు ( Sexually assaulted ) పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆ ఇద్దరినీ పనిలోంచి తొలగించిన ఆస్పత్రి యాజమాన్యం.. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్పత్రి యాజమాన్యం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన గ్రేటర్‌ నోయిడా పోలీసులు.. ఆ యువతిని లైంగికంగా వేధించిన నిందితులు లవ్‌కుశ్, ప్రవీణ్‌లపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. కన్సల్టెన్సీ పద్ధతిలో ఏజెన్సీ ద్వారా నియమితులైన ఆ ఇద్దరినీ విధుల నుంచి తొలగించామని సదరు ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. 

Also read : Rythu bandhu scheme : రైతులకు గుడ్ న్యూస్

కరోనావైరస్ పాజిటివ్‌తో బాధపడుతున్న వారిపై లైంగిక దాడులకు పాల్పడటం ఇటీవల ఇది రెండో కేసు. మూడు రోజుల క్రితమే ముంబైలో ఓ డాక్టర్ కరోనా పాజిటివ్ పేషెంట్‌పై లైంగిక దాడికి పాల్పడిన నేరంలో పోలీసుల చేతికి చిక్కిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో డాక్టర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడికి కరోనా సోకి ఉంటుందనే అనుమానంతో అరెస్ట్ చేయకుండా ప్రస్తుతానికి హోమ్ క్వారంటైన్‌కి తరలించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News