Covid-19 positive cases in India: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు తగ్గాయి. కోవిడ్19 పాజిటివ్ కేసులు మరోసారి స్వల్పంగా పెరిగాయి. లాక్‌డౌన్ సడలించంతో జనాల రద్దీ పెరిగడంతో నిన్నటితో పోల్చితే కరోనా కేసులు అధికంగా నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 3 కోట్లు దాటింది.
ఇండియాలో మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 50,848 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపితే దేశంలో కరోనా వైరస్ (CoronaVirus) కేసుల సంఖ్య 3,00,28,709 (3 కోట్ల 28 వేల 709)కు చేరుకుంది. కరోనా మరణాలు సైతం స్వల్పంగా పెరిగాయి. మంగళవారం నాడు 1,358 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో ఇప్పటివరకూ సంభవించిన కరోనా మరణాల సంఖ్య 3,90,660 (3 లక్షల 90 వేల 660)కు చేరింది.
Also Read: AP Corona Update: ఏపీలో రెట్టింపు సంఖ్యలో కరోనా రికవరీ రేటు, 2 కోట్లు దాటిన కరోనా
మంగళవారం నాడు దేశవ్యాప్తంగా 68,817 మంది కరోనాను జయించారు. కోవిడ్19 మహమ్మారి నుంచి దేశవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,89,94,709 (2 కోట్ల 89 లక్షల 94 వేల 709)కు చేరుకుంది. దేశంలో యాక్టివ్ కేసులు 82 రోజుల కనిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం దేశంలో 6,43,194 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. భారత్‌లో కోవిడ్-19 (COVID-19) రికవరీ రేటే 96.56కు పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.67కు దిగొచ్చిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే పిల్లలు పుట్టరా, కేంద్ర ఆరోగ్యశాఖ క్లారిటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook