Covid Cases Updates: కరోనా కేసులు తగ్గినా.. కొవిడ్‌ మరణాలు మాత్రం తగ్గట్లే!

Covid New Cases in India: దేశంలో వరుసగా నాలుగోరోజు కూడా కొవిడ్‌ కేసులు మూడు లక్షల దిగువనే నమోదు.. కేసులు తగ్గినా మరణాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2022, 02:14 PM IST
  • దేశంలో వరుసగా నాలుగోరోజు కాస్త తగ్గిన కొవిడ్‌ కేసులు
  • మూడు లక్షల దిగువనే కరోనా కేసుల నమోదు
  • 2.51 లక్షల కొవిడ్ కేసులు నమోదు
Covid Cases Updates: కరోనా కేసులు తగ్గినా.. కొవిడ్‌ మరణాలు మాత్రం తగ్గట్లే!

Coronavirus Omicron Cases in India: దేశంలో తాజాగా 2.51 లక్షలకు కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ముందు రోజులతో పోల్చుకుంటే దాదాపు 35 వేల వరకు కొవిడ్‌ కేసులు తగ్గాయి. అలాగే కొవిడ్ (Covid) పాజిటివిటీ రేటు కూడా తగ్గింది. 19.5 శాతం నుంచి 15.88 శాతానికి పాజివిటీ రేట్ తగ్గింది. నిన్న 15 లక్ష మందికి కొవిడ్‌ టెస్ట్‌లు (Covid tests) చేశారు. దీంతో ఈ స్థాయిలో కొవిడ్ కేసులు (Covid Cases) బయటపడ్డాయి. 

ఇక మహారాష్ట్ర, ఢిల్లీలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఏపీ, గుజరాత్, రాజస్థాన్‌లలో మాత్రం కొవిడ్ పాజిటివిటీ రేట్ భారీగా పెరుగుతోంది. 

నిన్న ఒక్క రోజే కేరళలో (Kerala) 51 వేల మంది కొవిడ్ బారినపడ్డారు. 94 శాతం కొవిడ్ పాజిటివ్‌ శాంపిల్స్‌లలో ఒమిక్రాన్ వేరియెంట్‌ను గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి తెలిపారు. ఇక మిగిలిన ఆరు శాతం నమూనాల్లో డెల్టా వేరియెంట్ ఉన్నట్లు వెల్లడించారు.

దేశంలో కొవిడ్ కొత్త కేసులు కాస్త తగ్గినా, మరణాలు మాత్రం బాగానే పెరిగాయి. గత 24 గంటల వ్యవధిలో 627 మంది మృత్యువాత పడ్డారు. ఈ రెండేళ్లలో 4,92,327 మంది కొవిడ్‌ వల్ల ప్రాణాలు కోల్పొయారు.

Also Read: ప్రాక్టీస్‌ లేకుండా బరిలో దిగడం కష్టం.. టీమిండియాలో అతడి రీఎంట్రీ అంత ఈజీ కాదు: భజ్జీ   

అలాగే కొవిడ్ కొత్త కేసులతో పాటు రికవరీల సంఖ్య కూడా ఎక్కువే ఉంటోంది. నిన్న 3,47,443 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 93.60 శాతానికి మెరుగైంది. దేశంలో ఇప్పటివరకూ నాలుగు కోట్ల లక్షల మంది కొవిడ్ బారినపడగా.. 3.8 కోట్ల మంది కొవిడ్‌ను (Covid) జయించారు.

Also Read: Rajinikanth: ధనుష్, ఐశ్వర్యలను కలపడానికి సూపర్ స్టార్ ప్రయత్నాలు.. ఫోన్ చేసి మరీ..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News