CUET UG 2023: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ రిజిస్ట్రేషన్ అప్పుడే!

  CUET UG 2023: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొన్ని రోజుల్లో CUET UG పరీక్ష 2023 కోసం రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించనుంది, అయితే ఈ విషయంపై యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ ఏమన్నారో తెలుసా? 

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 9, 2023, 07:25 PM IST
CUET UG 2023: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ రిజిస్ట్రేషన్ అప్పుడే!

CUET UG Registration 2023: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (CUET UG 2023) కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. CUET UG 2023 రిజిస్ట్రేషన్, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించే తేదీని 2 రోజుల్లో ప్రకటిస్తామని UGC చైర్మన్ ఎం.జగదీష్ కుమార్ ట్వీట్ చేయడం ద్వారా ఈ విషయం చర్చనీయాంశం అయింది. ఈ పరీక్షలకు సంబందించిన అధికారిక వెబ్‌సైట్ cuet.samarth.ac.inలో నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు.

ఇక CUET UG 2023 రిజిస్ట్రేషన్ ప్రారంభం త్వరలోనే కానుంది అంటూ యూజీసీ చైర్మన్ ట్వీట్ చేసిన క్రమంలో అందరూ ఈ విషయం మీద ఆసక్తి చూపిస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన ప్రవేశ పరీక్షల టైమ్ టేబుల్ ప్రకారం, CUET UG 2023 పరీక్షలు మే 21, 2023 నుండి జరగాల్సి ఉంది, ఈ ఏడాది పరీక్షల విధానంలో ఎలాంటి మార్పు ఉండదని కూడా చెబుతున్నారు.

CUET స్కోర్‌కార్డ్ ద్వారా, విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది. గతంలో UGC విడుదల చేసిన నోటీసులో CUET UG 2023 కోసం రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 2023 మొదటి వారం నుండి ప్రారంభమవుతుందని చెప్పినా పలు కారణాలతో అది జరగలేదు. కొన్ని కారణాల వల్ల తేదీని పొడిగించాల్సి రావడంతో ఇప్పుడు తాజా అప్డేట్ ఇచ్చారు.

ఇక CUET UG పరీక్ష 21 నుండి 31 మే 2023 వరకు నిర్వహించబడుతుంది, ఈ పరీక్ష మొత్తం 13 భాషల్లో నిర్వహించబడుతుంది. అలాగే CUET UG పరీక్ష దేశవ్యాప్తంగా 1000 పరీక్షా కేంద్రాలలో నిర్వహించబడుతుంది, వీటిలో ప్రతిరోజూ 450 నుండి 500 కేంద్రాలలో పరీక్ష నిర్వహించబడుతుందని అంటునారు. అయితే పరీక్షకు సంబంధించిన ఏవైనా తాజా సమాచారం కోసం, అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సందర్శించాలని అక్కడ అయితేనే మీరు సరైన సమాచారం అలాగే వాలిద్ సమాచారం తెలుసుకుంటారని చెబుతున్నారు. 

Also Read: JEE Mains 2023 Results: జేఈఈ మెయిన్ తొలి సెషన్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

Also Read: Waltair Veerayya OTT update : ఓటీటీలోకి వాల్తేరు వీరయ్య.. ఎప్పుడు, ఎక్కడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News