బెంగళూరులో ఓ వ్యాపారి ఖాతా నుండి రూ.45 లక్షలు మాయం

సైబర్ నేరగాళ్ల దోపిడీకి అడ్డూ అదుపులేకుండా పోతోంది. వ్యక్తిగత ఖాతాల్లోకి చొరబడి గంపగుత్తగా లక్షల్లో దోచుకుంటున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ మోసాలతో జాగ్రత్తగా ఉండాలంటూ సైబర్ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ వ్యాపారి నిండా మునిగాడు. వివరాల్లోకి వెళితే..

Last Updated : Jan 10, 2020, 06:23 PM IST
బెంగళూరులో ఓ వ్యాపారి ఖాతా నుండి రూ.45 లక్షలు మాయం

బెంగళూరు: సైబర్ నేరగాళ్ల దోపిడీకి అడ్డూ అదుపులేకుండా పోతోంది. వ్యక్తిగత ఖాతాల్లోకి చొరబడి గంపగుత్తగా లక్షల్లో దోచుకుంటున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ మోసాలతో జాగ్రత్తగా ఉండాలంటూ సైబర్ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ వ్యాపారి నిండా మునిగాడు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని విజయ్ నగర్‌కు చెందిన టీవీ జగదీశ్ క్రియేటీవ్ ఇంజినీర్స్ అనే కంపెనీ నిర్వహిస్తున్నాడు. గత శనివారం నుంచి అతని ఎయిర్ టెల్ సిమ్ కార్డు పని చేయడం లేదు. దీనిపై ఫిర్యాదు చేద్దామని ఎయిర్‌టెల్ కస్టమర్ కేర్‌ను సంప్రదించేలోగా గుండెలదిరిపోయే వార్త తెలిసింది. ఆయన కంపెనీ బ్యాంక్ అకౌంట్ నుంచి వివిధ లావాదేవీల రూపంలో రూ.45.70 లక్షలు మాయమయ్యాయి. కేవలం ముప్ఫై నిమిషాల వ్యవధిలోనే ఇదంతా జరిగింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకోగా.. మంగళవారం ఫిర్యాదు చేశారు.
 
దీని వెనక అసలేం జరిగిందంటే.. హ్యాకర్లు కంపెనీ అధికారిక ఈమెయిల్‌ను హ్యాక్ చేశారు. దానినుండి డూప్లికేట్ సిమ్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ వెంటనే ఫిషింగ్ ఎటాక్ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూజర్‌నేమ్, పాస్వర్డ్ సేకరించి.. లావాదేవీలు జరిపారు. దీనిపై ఎయిర్‌టెల్ సంస్థకి జగదీశ్ ఫిర్యాదు చేయగా.. కంపెనీ నుంచి అధికారికంగా మెయిల్ రావడం వల్ల తాము డూప్లికేట్ సిమ్ ఇచ్చామని తెలిపింది.
 
ఇదిలా ఉంటే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కు కేసు అప్పగించారు. సిమ్ కార్డు క్లోనింగ్ ద్వారా సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్న విషయాన్ని గమనించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్, మెసేజ్‌ల ద్వారా వచ్చే లింకులను క్లిక్ చేయొద్దని సూచిస్తున్నారు. చౌకగా వస్తున్నాయని.. సిమ్‌లు కూడా ఎక్కవగా వినియోగించొద్దని తెలుపుతున్నారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News