తిరువనంతపురం: కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం 'ఓఖీ' తుఫాను ధాటికి నిరాశ్రయులైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించారు. మంత్రివర్యులు వారికి రెస్క్యూ టీమ్ సమర్ధవంతంగా పనిచేస్తుందని భరోసా ఇచ్చారు. "ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ మరియు వైమానిక దళం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. రెస్క్యూ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో సమర్ధవంతంగా కొనసాగుతాయి" అని ఆమె చెప్పారు.
Smt @nsitharaman meets fishermen families affected by #CycloneOckhi at Vizhinjam, Thiruvananthapuram and assures that search & rescue operations by Indian Navy, Coastguard & Airforce will continue with full vigour. pic.twitter.com/erSEwR9Lsj
— Raksha Mantri (@DefenceMinIndia) December 4, 2017
తమిళనాడు, కేరళ, లక్షద్వీప్ తీరప్రాంతాల్లో 'ఓఖీ' తుఫాను పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం కన్యాకుమారికి వచ్చారు. సముద్రంలో 'ఓఖీ' తుఫాను ధాటికి చిక్కుకుపోయిన 71 మంది తమిళ జాలర్లతో సహా మొత్తం 357 మంది మత్స్యకారులను రెస్క్యూ టీం కాపాడినట్లు చెప్పారు.
#HADR #CycloneOckhi #OpSahayam Seaking 42 B/C positioned at Kavaratti islands for relief ops takes off with first light..@DefenceMinIndia @nsitharaman @SpokespersonMoD pic.twitter.com/Hzxb13dbDX
— SpokespersonNavy (@indiannavy) December 4, 2017
నవంబర్ 2వ తేదీ తమిళనాడు అధికారులు 'ఓఖీ' తుఫాను కారణంగా మొత్తం 19 మంది మృతి చెందినట్లు చెప్పారు. అలానే ఇప్పటివరకు 690 మందిని రెస్క్యూ టీమ్ రక్షించిందని, ఇంకా 96 మంది జాలర్ల ఆచూకీ లభ్యం కాలేదని తెలిపారు. గాయపడ్డ 63 మందిని హాస్పిటల్ కు చేర్పించామని, తుఫాను ధాటికి 74 ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. 1,122 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు.
#CycloneOckhi: Relief operations at naval detachment Minicoy in Lakshadweep.#AIRPics: Mayusha pic.twitter.com/KQFAAjkbzs
— All India Radio News (@airnewsalerts) December 4, 2017
శనివారం అతి భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు కారణంగా 'ఓఖీ' తుఫాను దెబ్బకు కేరళ, తమిళనాడు తీరప్రాంతాల్లో ఆస్తి నష్టం, ప్రజలు నిరాశ్రయులైన సగంతి తెలిసిందే..!