న్యూఢిల్లీలోని బురారీ ప్రాంతంలో సాముహిక ఆత్మహత్యల అంశం కలకలం రేపిన విషయం తెలిసిందే. 11 మంది ఆత్మహత్యలకు కారణం మూఢ నమ్మకాలేనని పోలీసులు నిర్ధారించారు. కాగా ఆత్మహత్యలు చేసుకున్న ఆ ఇంటి విషయంలో స్థానికుల నుంచి సరికొత్త డిమాండ్ వినిపిస్తోంది. ఇక ఈ ఇంటిని దీన్ని అమ్మాలన్నా కొనుగోలు చేసే వారు ఎవరూ ఉండరని అభిప్రాయపడుతున్న స్థానికులు కొందరు.. దీన్ని ఆలయంగా మార్చాతే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నారాయణ్ దేవి కుటుంబం ముక్తి కోసం చనిపోయారు కాబట్టి ఆలయం కట్టడంలో తప్పులేదని తమ వాదనను కొందరు సమర్ధించుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ఇంటి చుట్టుపక్కలా ఉన్న చాలా మంది ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్న పరిస్థితి నెలకొంది. బంధువులు కూడా ఆ ఇంటిని తీసుకనేందుకు ముందుకు రావడం లేదు. నారాయణ్ దేవి కుమార్తె, కుమారుడు ఈ ఇల్లు తమకు వద్దని చెబుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ఇంటిని పోలీసులు సీజ్ చేసి ఉంచారు.