CBI Summons Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి సీబీఐ నోటీసులు జారీచేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సర్కారులో కీలక పదవుల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతల ప్రమేయం ఉందని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని ప్రశ్నించి ఆయన నుంచి కూడా వివరాలు రాబట్టాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. ఈ కారణంగానే ఏప్రిల్ 16న విచారణకు హాజరు కావాల్సిందిగా అరవింద్ కేజ్రీవాల్ కి సీబీఐ అధికారులు నోటీసులు జారీచేశారు.
ఇప్పటికే ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మనీశ్ సిసోడియా విచారణ ఖైదీగా జైల్లోనే ఉన్నారు. మనీశ్ సిసోడియాతో పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఎంతో మంది బడా బడా వ్యాపారులు అరెస్ట్ అయ్యారు. అందులో తెలుగు వారు కూడా ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కవిత కూడా ఇదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో కీలకంగా మారిన ఫోన్లను ఆధారం లేకుండా కవిత ధ్వంసం చేశారని ఈడీ ఆరోపించగా.. ఈడీ ఆరోపణల్లో వాస్తవం లేదంటూ కవిత తన ఫోన్లను ఈడికి అప్పగించారు.
మరోవైపు మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ సైతం హైదరాబాద్ కి హవాలా మార్గంలో నగదు చేరవేసినట్టుగా చెబుతూ వెల్లడించిన వివరాలు కూడా ఎమ్మెల్సీ కవిత వైపై వేలెత్తి చూపిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి : Delhi Liquor Scam Case: సుప్రీంలో వాడివేడిగా వాదనలు, కవితకు నిరాశ, మూడు వారాలు వాయిదా
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి సీబీఐ నోటీసులు జారీచేసిన నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణ కీలక దశకు చేరుకుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో కీలక వ్యక్తుల అరెస్టులు జరిగే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో.. ఎప్పుడు, ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు ఈ మొత్తం కుంభకోణం విచారణను మొదటి నుంచి పరిశీలిస్తున్న వారు.
ఇది కూడా చదవండి : MLC Kavitha Delhi Liquor Scam: ఇది మహిళలు చేసే వ్యాపారామా..? నీకు ఇదే దొరికిందా..? ఎమ్మెల్సీ కవితపై ఈటల ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK