Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బిగ్ ట్విస్ట్.. ఎక్స్ వేదికగా పంచులు వేసిన స్వాతీమలీవాల్..

Swati maliwal row: ఆప్ ఎంపీ స్వాతిమాలీవాల్ పై దాడి ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ ఘటనలో పోలీసులు అరవింద్ కేజ్రీవాల్ బిభవ్ కుమార్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Written by - Inamdar Paresh | Last Updated : May 23, 2024, 09:12 AM IST
  • ఇద్దరి వాదనలు సరైన విధంగా వినాలి..
  • స్వాతీమాలీవాల్ ఘటనలో స్పందించిన కేజ్రీవాల్..
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బిగ్ ట్విస్ట్.. ఎక్స్ వేదికగా పంచులు వేసిన స్వాతీమలీవాల్..

Arvind kejriwal first reaction on swati maliwal assult row: దేశంలో  ఒక వైపు ఎన్నికల హీట్ నడుస్తుంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్, స్వాతి  మాలీవాల్ పై దాడి ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనలో ఇప్పటికే ఢిల్లీ పోలీసుల ఎదుట స్వాతిమలీవాల్ తన గొడును చెప్పుకున్నారు. కోర్టు ఎదుట స్టేట్ మెంట్ కూడా రికార్డు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలు నుంచి విడుదల అయిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ను కలవడానికి ఎంపీ స్వాతిమలీవాల్ ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడ ఉన్న పీఏ బిభవ్ కుమార్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, తనపై ఇష్టమున్నట్లు దాడిచేసినట్లు ఆమె ఫిర్యాదు చేశారు. పొత్తికడుపులో కొడుతూ.. పైశాచికంగా ప్రవర్తించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ ప్రారంభించిన పోలీసులు.. బిభవ్ కుమార్ ను ఇప్పటికే అరెస్టు చేశారు.

Read more: Bhootonwala mandir: ఒక్క రాత్రిలో దెయ్యాలు కట్టిన ఆలయం.. దీని విశిష్టతో ఏంటో తెలుసా..?

అదే విధంగా స్వాతీమాలీవాల్ శరీరంలో గాయలున్నట్లు కూడా వైద్యులు నివేదిక ఇచ్చారు. మరోవైపు స్వాతీమాలీవాల్ బీజేపీకీ ఏజెంట్ గా మారిందని, ఎన్నికల ముందు ఆప్ ను దెబ్బతీసేందుకు కుట్రపన్నారని ఆప్ నేతలు దాడికి దిగారు. ఈ నేపథ్యంలో.. కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేశారు. వాటిలో స్వాతిమలీవాల్ సెక్యురిటీ సిబ్బందితో గొడవలు పడినట్లు ఉంది. దీన్ని స్వాతీమాలీవాల్ తీవ్రంగా ఖండించారు. కేవలం ఎడిట్ చేసిన వీడియోలు వదులుతున్నారని, ఆరోజు సీఎం ఆఫీసులో జరిగిన సీసీ ఫుటేజ్ ను చూపించాలని కూడా కోరారు.  ఇదిలా ఉండగా.. దీనిపై ఇప్పటి వరకు  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కనీసం నోరు మెదపట్లేదంటూ బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. మరోవైపు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సైతం దీనిపై కేజ్రీవాల్ సరైన విధంగా  స్పందిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇక ఎన్నికలకు ముందు తీవ్ర వివాదస్పందంగా మారిన స్వాతీమాలీవాల్ ఘటనపై అర్వింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ  ఘటనలో ఉన్న రెండు కోణాలను పోలీసులు సమగ్రంగా పరిశీలించాలన్నారు. స్వాతీమాలీవాల్ కు న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై ఇద్దరి నుంచి నిష్పక్షపాతంగా విచారణ జరిపినప్పుడే సరైన న్యాయం జరుగుతుందని కేజ్రీవాల్ అన్నారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకు మించి తాను ఏమీ మాట్లాడలేనని అర్వింద్ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

Read more: Snakes facts: ప్రపంచంలోనే అత్యంత స్పీడ్ గా వెళ్లే పాములు.. ఇవి చాలా డెంజర్ భయ్యా.. డిటెయిల్స్ ఇవే..

మరోవైపు దీనిపై స్వాతీమాలీవాల్ ఎక్స్ వేదికగా రివర్స్ అటాక్ కు దిగారు.తనపై ఆప్ నేతలు, మంత్రులను ఉసిగొల్పి బీజేపీ ఏజెంట్ అంటూ విమర్శించారన్నారు.  ఎడిట్ చేసిన వీడియోలు లీక్ చేస్తు, నిందితుడితో తిరుగుతూ ఎవిడెన్స్ లను తారుమారు చేశారన్నారు. చివరకు ఇలా స్వేచ్చగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పడం విడ్డూరంగా ఉందంటూ స్వాతీమాలీవాల్ కేజ్రీవాపై పంచ్ లు వేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News