ZEE Entertainment: జీ మీడియా సంస్థకు మరో గుడ్ న్యూస్.. బ్లూమ్‌బెర్గ్ అప్పీల్ ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు..

Delhi High Court: జీ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌పై  బ్లూమ్‌బెర్గ్ ఫిబ్రవరి 21న అసత్య కథనాన్ని ప్రచురించింది.  జీ మీడియా సంస్థకు పూర్తిగా పరువు నష్టం కల్గించే విధంగా కథనాన్ని ప్రచురించింది.  ఈ క్రమంలో జీ మీడియా సంస్థ కోర్టులో పిటిషన్ ను దాఖలు చేసింది. దీన్ని విచారించిన  ట్రయల్ కోర్టు జీకి అనుకూలంగా తీర్పునిచ్చింది.    

Written by - Inamdar Paresh | Last Updated : Mar 14, 2024, 08:49 PM IST
  • ట్రయాల్ కోర్టు వాదనను సమర్థించిన ఢిల్లీ హైకోర్టు..
  • బ్లూమ్‌బెర్గ్ అప్పీల్ ను తోసిపుచ్చిన ధర్మాసనం..
ZEE Entertainment: జీ మీడియా సంస్థకు మరో గుడ్ న్యూస్.. బ్లూమ్‌బెర్గ్ అప్పీల్ ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు..

Delhi HighCourt Dismisses Bloombergs Appeal: కార్పొరేట్ గవర్నెన్స్,  వ్యాపారానికి సంబంధించి ZEE ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ZEE)కి వ్యతిరేకంగా ఫిబ్రవరి 21 నాటి పరువు నష్టం కలిగించే విధంగా బ్లూమ్‌బెర్గ్ టెలివిజన్ ప్రొడక్షన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (బ్లూమ్‌బెర్గ్)ని ఒక కథనాన్ని ప్రచురించింది. కంపెనీ వద్ద $241 మిలియన్ల అకౌంటింగ్ సమస్యను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) గుర్తించిందని సదరు బ్లూమ్‌బెర్గ్  ప్రచురించింది. దీనిపై జీ మీడియా కోర్టును ఆశ్రయించింది. ఈ ప్రచురణ జీ మీడియాను పూర్తిగా చెడ్డపేరు తెచ్చే విధంగా ఉందని, ఇది సంస్థను కావాలనే అపఖ్యాతి తీసుకొచ్చేలా ప్రచురణ చేశారని జీ మీడియా కోర్టులో పిటిషన్ ను దాఖలు చేసింది.

ZEE తన దావాలో..  ZEE యొక్క కార్పొరేట్ పాలన,  వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను పేర్కొన్న బ్లూమ్‌బెర్గ్ కథనం సహజంగా సరికాదని కోర్టులో జీ మీడియా తరపు లాయర్లు గట్టిగా వాదించారు. బ్లూమ్‌బెర్గ్ అసత్య కథనం వల్ల కంపెనీ షేరు ధరలో 15 శాతం తగ్గుదలకు దారితీసిందని, పెట్టుబడిదారుల సంపదను దెబ్బతీసిందని వాదించింది. కంపెనీ పరువు తీయాలనే ఉద్దేశ్యంతో ముందస్తుగా ఆలోచించి, "తప్పుడు,  వాస్తవంగా తప్పు" కథనం ప్రచురించబడిందని పేర్కొంది.  అయితే  బ్లూమ్‌బెర్గ్ ఆరోపించిన విధంగా సెబీ  రెగ్యులేటర్ నుండి అలాంటి ఆర్డర్ ఏమీ లేదని కథనం తప్పుగా ప్రచురించబడిందని కోర్టులో వాదనలు వినిపించింది.

దీనిపై ట్రయల్ కోర్టు అదనపు డిస్ట్రిక్ట్ జడ్జి (ADJ) హర్జ్యోత్ సింగ్ భల్లా, ZEEకి ఉపశమనం ఇస్తూ, తాత్కాలిక ఎక్స్-పార్టీ నిషేధాజ్ఞలను ఆమోదించినందుకు ప్రాథమిక కేసును రూపొందించామని,  బ్లూమ్‌బెర్గ్ తన ప్లాట్‌ఫారమ్ నుండి పరువు నష్టం కలిగించే కథనాన్నితొలగించాలని ఆదేశించింది.  ఈక్రమంలో దీనిపై బ్లూమ్‌బెర్గ్  ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. కాగా, దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ,  బ్లూమ్‌బెర్గ్ టెలివిజన్ ప్రొడక్షన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (బ్లూమ్‌బెర్గ్)ని ఆదేశించిన ట్రయల్ కోర్టు ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు కూడా గురువారం సమర్థించింది.

ఈ కేసును  జస్టిస్ శాలిందర్ కౌర్, బ్లూమ్‌బెర్గ్ ధర్మాసనం పరిశీలించింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం అప్పీల్ ను పూర్తిగా తోసిపుచ్చింది. అదే విధంగా..  ADJ ఆదేశాలను పాటించడానికి మూడు రోజుల సమయం ఇచ్చారు.  ఈ క్రమంలో  బ్లూమ్‌బెర్గ్ కు ఢిల్లీ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు గట్టి చెంపపెట్టులాగా మారింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News