Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత అనుచరుడు అరెస్ట్.. నెక్స్ట్ ఎవరో?

Delhi Liquor Scam:ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ మరింత దూకుడు పెంచింది. హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి అభిషేక్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసింది. బోయినపల్లి అభిషేక్ రావు గతంలో ఎమ్మెల్సీ కవిత దగ్గర పని చేశారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో  లిక్కర్ స్కాంలో తెలంగాణ నుంచి తర్వాత ఎవరూ అరెస్ట్ అవుతారన్నది ఆసక్తి గా మారింది.

Written by - Srisailam | Last Updated : Oct 10, 2022, 12:58 PM IST
  • లిక్కర్ స్కాం కేసులో సీబీఐ దూకుడు
  • హైదరాబాద్ లో అభిషేక్ రావు అరెస్ట్
  • ఎమ్మెల్సీ కవిత అనుచరుడు అభిషేక్
Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత అనుచరుడు అరెస్ట్..  నెక్స్ట్ ఎవరో?

Delhi Liquor Scam: కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారమే నిజమవుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి దసరా పండుగ తర్వాత సంచలనాలు జరగబోతున్నాయన్న వార్తలే నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు అరెస్ట్ కాగా.. తాజాగా మరొకరని అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కాంలో మొదటి నుంచి హైదరాబాద్ లింకులు బయటికి రాగా... తాజాగా హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి అభిషేక్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.హైదరాబాద్‌లో సీబీఐ అరెస్ట్ చేసి ఢిల్లికి తరలిస్తుంది. అబిషేక్ బోయినపల్లి రాబిస్ డిస్టిలరీస్ డెరెక్టర్‌గా ఉన్నాడు. మాదాపూర్ లో ఉన్న అనూస్ బ్యూటీ పార్లర్‌లో రాబిస్ డిస్టిలరీస్ కార్యాలయం ఏర్పాటైంది. లిక్కర్ స్కాం కేసులో ఏ14 నిందితుడిగా ఉన్న లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్రన్ పిళ్లై తో కలిసి అభిషేక్ బోయినపల్లి వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం.

లిక్కర్ స్కాంలో మొదటగా విజయ్ నాయర్ అరెస్ట్ అయ్యారు. రాబిస్ డిస్టిలరీస్ తో పాటు మరో 9 కంపెనీల్లో అభిషేక్ రావు డైరెక్టర్‌గా ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. లిక్కర్ స్కాంలో ఇప్పటికే విజయ్ నాయర్ ను అరెస్ట్ చేయగా.. అభిషేక్ రావు అరెస్ట్ రెండోది.  ముంబై కేంద్రంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగంలో సేవ‌లు అందిస్తున్న ఓన్లీ మ‌చ్ లౌడ‌ర్ కంపెనీ అధిపతిగా ఉన్నారు విజయ్ నాయర్. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌ దీని కేంద్రంగా సాగిందనే వార్తలు వస్తున్నాయి.కేంద్ర కార్పోరేట్ వ్యవహారాల శాఖ సమాచారం ప్రకారం తొమ్మిది కంపెనీల్లో అభిషేక్ రావు వాటాలు కలిగి వున్నాడు. ఆ 9 కంపెనీల్లో వివిధ రకాల వ్యాపారాలు వున్నాయి. రియల్ ఎస్టేట్, మైనింగ్ క్వారీయింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, కెమికల్స్ మరియు కెమికల్ ప్రొడక్స్ట్, కంప్యూటర్ రిలేటెడ్ సర్వీసులు వున్నాయి. అభిషేక్ రావు అరెస్టుతో ఢిల్లీ మద్యం కుంభకోణంలో డొంకంతా కదులుతుందని భావిస్తున్నారు.

లిక్కర్ స్కాంలో ఈడీ కూడా విచారణ జరుపుతోంది. దేశవ్యాప్తంగా 25 చోట్ల సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ లోనూ పలు సార్లు తనిఖీలు జరిగాయి. హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు, చెన్నై, పంజాబ్, ఢిల్లీలలో పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలక ఆధారాలు సేకరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ సోదాలు ముగిసిన క్రమంలో అభిషేక్ రావును అరెస్ట్ చేయడం చర్చకు దారి తీసింది. టీఆర్ఎస్‌ ముఖ్య నేతలతో అభిషేక్ రావుకు సంబంధాలు ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కూతురు కవితకు సంబంధం ఉందని ఢిల్లీ బీజేపీ ఆరోపించడం కలకలం రేపింది. అయితే లిక్కర్ స్కాంలో తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు కవిత. అయినా సీబీఐ, ఈడీ సోదాలు మాత్రం కవిత సన్నిహితుల చుట్టే జరిగాయి. తాజాగా అరెస్టైన బోయినపల్లి అభిషేక్ రావు గతంలో కవిత దగ్గర పని చేశారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో  లిక్కర్ స్కాంలో తెలంగాణ నుంచి తర్వాత ఎవరూ అరెస్ట్ అవుతారన్నది ఆసక్తి గా మారింది.

Also Read: Nayanthara Surrogacy : సరోగసి ద్వారా పిల్లల్ని కన్న సెలెబ్రిటీల లిస్ట్ ఇదే

Also Read: Mulayam Singh Yadav Dies: ములాయం సింగ్‌ యాదవ్‌ కన్నుమూత!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

Trending News