ప్రజలు ఆధార్ నెంబర్‌ను ఆన్‌లైన్, సోషల్ మీడియాలో ఎవరితోనూ పంచుకోవద్దని, సవాళ్లు విసరవద్దని భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) సూచించింది. ఇతరుల ఆధార్ సంఖ్యను ఏ అవసరం కోసమైనా దాన్ని నేరంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. చట్టబద్ధమైన అవసరాలు, న్యాయసమ్మత లావాదేవీల్లో ఒక ఐడీగా ఆధార్‌ను ఉపయోగించాలని, ఇదెంతో కీలకమైన వ్యక్తిగత సమాచారమని ప్రకటనలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: ఆధార్ నెంబర్ చెప్పిన ట్రాయ్ ఛైర్మన్.. డేటా మొత్తం చేప్పేసిన నెటిజన్లు
కాగా భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) ఛైర్మన్ రామ్ సేవక్ శర్మ ఇటీవల తన ఆధార్ సంఖ్యను బహిర్గతంగా వెల్లడించి, దుర్వినియోగానికి ఎలా పాల్పడుతారో చూపించాలని సవాల్ విసరడం.. తదనంతర పరిణామాల నేపథ్యంలో యూఐడీఏఐ మంగళవారం ఈ సూచన చేసింది.
ఇది కూడా చదవండి: ట్రాయ్ ఛైర్మన్ అకౌంట్లోకి రూ.1 ట్రాన్స్‌ఫర్ చేసిన హ్యాకర్లు
ఆధార్ వెల్లడిపై ఆర్ఎస్ శర్మ నో కామెంట్
తన ఆధార్‌ను వెల్లడించడంపై మాట్లాడటానికి ట్రాయ్ ఛైర్మన్ ఆర్.ఎస్.శర్మ నిరాకరించారు. తన నిర్ణయాలపై సహేతుక విమర్శలు మంచివనీ, నిలకడలేని ఆరోపణలు సంస్థ ప్రతిష్ఠను దిగజారుస్తాయని ఒక ప్రశ్నకు బదులు చెప్పారు.