Agni 5 Missile: మరో మైలురాయి సాధించిన డీఆర్డీవో, అగ్ని 5 క్షిపణి విజయవంతం

Agni 5 Missile: డీఆర్డీవో మరో మైలురాయి సాధించింది. అగ్ని 5 అణు బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఒడిశా నుంచి డమ్మీ వార్ హెడ్స్‌తో చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 15, 2022, 10:04 PM IST
Agni 5 Missile: మరో మైలురాయి సాధించిన డీఆర్డీవో, అగ్ని 5 క్షిపణి విజయవంతం

భారత రక్షణ శాఖ అంతకంతకూ పటిష్టమౌతోంది. డీఆర్టీవో మరో క్షిపణి అభివృద్ధి చేసింది. ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఈ క్షిపణి ప్రయోగం సక్సెస్ అవడంతో భారత రక్షణశాఖ మరింత స్ట్రాంగ్ అయింది. 

డీఆర్డీవో అభివృద్ధి చేసిన అగ్ని 5 అణు బాలిస్టిక్ క్షిపణి పరీక్ష ప్రయోగానికి ముందు బంగాళాఖాతం ప్రాంతాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. అనంతరం క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు. గతంలో ప్రయోగించిన అగ్ని క్షిపణి కంటే ఇది మరింత తేలిగ్గా ఉందని రక్షణశాఖ తెలిపింది. అగ్ని5 మిస్సైల్ సామర్ధ్యం ఈ ట్రయల్ రుజువు చేసినట్టు రక్షణశాఖ వెల్లడించింది. ఈ క్షిపణి 5500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించగలదు. 

ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్, అగ్ని 5ని దేశీయంగా డీఆర్డీవో అభివృద్ధి చేసింది. ఇక నుంచి డీఆర్డీవో త్వరలో అగ్ని 6 పై పనిచేయనుంది. ఇది జలాంతర్గాముల్నించి భూమికి ప్రయోగించగలదు. 8 వేల నుంచి 10 వేల కిలమీటర్ల దూరంలోని లక్ష్యాల్ని ఛేదించగలదు. ఇప్పటివరకూ అగ్ని-1, అగ్ని-2, అగ్ని-3, అగ్ని-4, అగ్ని-5 క్షిపణుల్ని అభివృద్ధి చేసి విజయవంతంగా ప్రయోగించింది. 

Also read; Delhi Acid Attack: ఢిల్లీ యాసిడ్ దాడిలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌కు నోటీసులు, ఆన్‌లైన్‌లో యాసిడ్ కొనుగోలు చేసిన నిందితుడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News