/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

DRDO Online Courses 2021: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ శుభవార్త అందిస్తోంది. నిరుద్యోగులు, విద్యార్ధుల కోసం రెండు షార్ట్ టర్మ్ ఆన్‌లైన్ కోర్సుల్ని ప్రారంభిస్తోంది. ఎవరెవరు అర్హులు..ఎలా దరఖాస్తు చేయాలనే వివరాలు ఇవే..

భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రతిష్ఠాత్మక డీఆర్డీవో (DRDO ) విద్యార్ధులు, నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ అందిస్తోంది. డీఆర్డీవో, డీమ్డ్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యాన రెండు స్వల్పకాలిక ఆన్‌లైన్ కోర్సుల్ని ప్రారంభించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( Artificial Intelligence ), మెషీన్ లెర్నింగ్ ( Machine Learning ), సైబర్ సెక్యూరిటీ ( Cyber Security ) విభాగాల్లో ఈ రెండు కోర్సుల్ని డిజైన్ చేసింది. వారంలో ఐదురోజులు, రోజుకు రెండు గంటల చొప్పున ఈ కోర్సులు 12 వారాల పాటు కొనసాగనున్నాయి. అయితే ఈ కోర్సుల్లో చేరడానికి ఫీజెంత, ఎవరెవరు అర్హులో పరిశీలిద్దాం.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్ధులు, లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్ధులు ఈ కోర్సులలో ఏదైనా ఒక విభాగంలో చేరవచ్చు. ముందుగా ప్రవేశ పరీక్ష ఉంటుంది. అందులో క్వాలిఫై అయిన విద్యార్దులకు కోర్సులో ప్రవేశం లభిస్తుంది. ఈ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష కోసం జనవరి 28వ తేదీ నుంచి డీఆర్డీవో అధికారిక వెబ్‌సైట్ ( DRDO Official website )  https://onlinecourse.diat.ac.in/DIATPortal/లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. ప్రవేశపరీక్షకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు కానీ..ఉత్తీర్ణులైన అభ్యర్ధులు ఒక్కో కోర్సుకు 15 వేల  రూపాయలు చెల్లించాలి. ప్రవేశ పరీక్షలో ( DRDO Entrance Exam ) ఉత్తీర్ణులైన అభ్యర్ధులు అడ్మిషన్ ఫీజును ఫిబ్రవరి 26లోగా చెల్లించాల్సి ఉంటుంది. 

DRDO Online Courses 2021:

రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యే తేదీ జనవరి 28 కాగా..చివరి తేదీ ఫిబ్రవరి 15. ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్, మెషీన్ లెర్నింగ్ ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 20న ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 21న ఉంటుంది. మూడు కోర్సుల ఫలితాలు ఫిబ్రవరి 22న వెల్లడిస్తారు. ఫిబ్రవరి 28 నుంచి ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభమవుతాయి.

Also read: 7th Pay Commission: నెలకు రూ 1.42 లక్షవరకు జీతం ప్లస్ TA, DA, HRA తో UPSC jobs notification

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
DRDO announces online courses in AI, Ml and cyber security, here are the details
News Source: 
Home Title: 

DRDO Online Courses 2021: డీఆర్డీవో ఆన్‌లైన్ కోర్సులకు ఇలా దరఖాస్తు చేయాలి..ఇవే అర్హ

DRDO Online Courses 2021: డీఆర్డీవో ఆన్‌లైన్ కోర్సులకు ఇలా దరఖాస్తు చేయాలి..ఇవే అర్హతలు
Caption: 
DRDO
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

రెండు ఆన్‌లైన్ కోర్సుల్ని ప్రారంభించిన డీఆర్డీవో

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, మెషీన్ లెర్నింగ్ విభాగాల్లో ఆన్‌లైన్ కోర్సులు

డిగ్రీ, డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్ఙత, కోర్సు ఫీజు 15 వేల రూపాయలు

Mobile Title: 
DRDO Online Courses 2021: డీఆర్డీవో ఆన్‌లైన్ కోర్సులకు ఇలా దరఖాస్తు చేయాలి..ఇవే అర్హ
Publish Later: 
No
Publish At: 
Thursday, January 28, 2021 - 18:31
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
53