Ramoji Rao: పత్రికా ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ఈనాడు సంస్థల అధిపతి చెరుకూరి రామోజీ రావు. తెలుగు పత్రికా ప్రపంచంలో సాటిలేని సామ్రాజ్యాన్ని స్థాపించడమే కాకుండా దేశమంతటా వివిధ భాషల్లో ఈటీవీ నెట్‌వర్క్‌ను విస్తరించిన ఘనాపాటి.
ప్రియా పచ్చళ్లను ప్రపంచమంతా విస్తరించిన పారిశ్రామిక వేత్తగా, ఈనాడు, ఈటీవీతో మీడియా మొఘల్‌గా, మార్గదర్శి చిట్‌ఫండ్స్, కళాంజలి, డాల్ఫిన్ హోటల్స్, రామోజీ ఫిల్మ్ సిటీ, ఉషోదయ ఫిలిమ్స్‌తో వ్యాపారవేత్తగా రామోజీరావు ప్రస్థానం అద్వితీయం. ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్డూడియో రామోజీ ఫిల్మ్ సిటీ స్థాపించిన ఘనత రామోజీదే. 2016లో బారతదేశపు రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ దక్కించుకున్న రామోజీ రావు కుటుంబం, విద్యాభ్యాసం ఇదీ
చెరుకూరి రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంతో పెరిశేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చాపు, రామోజీరావు తాతయ్య మరణించిన 13 రోజులకు రామోజీ రావు జన్మించాడు. దానితో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్యగాపేరు పెట్టారు. రామోజీ రావుకు ఇద్దరు అక్కలు ఉన్నారు. పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి, చిన్నక్క పేరు రంగనాయకమ్మ.
రామోజీ రావు బాల్యం, విద్యాభ్యాసం, వివాహం
రామోజీరావు కుటుంబం శ్రీ వైష్ణవం. తల్లి చాలా భక్తిపరురాలు, ఆచారవంతురాలు కావడంతో చిన్నతనంలో ఇతనికీ భక్తి, శుచి అలవడింది. లేకలేక పుట్టిన మగసంతానం కావడంతో రామోజీ అంటే చాలా గారాబం. పెద్దక్క పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా చిన్నక్క రంగనాయకమ్మతో సాన్నిహిత్యం ఉండేది. ఇంట్లో తల్లికి ఇంటిపనుల్లో, వంటలో సహాయం చేసే అలవాటూ ఉండేవంటారు. రామయ్య పేరు నచ్చకపోవడంతో ప్రాథమిక పాఠశాలలో చేరేప్పుడే రామోజీ రావు అనే పేరును తనకు తానే పెట్టుకున్నారు. రామోజీరావు 1947లో గుడివాడలో పురపాలకోన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరి అప్పట్లో ఉన్న ఆరవ ఫారం 1957లో పూర్తిచేశారు. తరువాత గుడివాడ కళాశాలలో ఇంటర్, బీఎస్సీ చదివారు. 1961 ఆగస్టు 19న రామోజీరావుకు, పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల రెండవ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ కాగా పెద్దలు పెట్టిన పేరు నచ్చక రమాదేవిగా మార్చుకుంది.
Also read: Ramoji Rao Death: ఈనాడు అదినేత రామోజీ రావు ఇక లేరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook