Tomoto Fever: చిన్నారులపై టమాట ఫ్లూ ప్రభావం, తమిళనాడు కేరళ సరిహద్దుల్లో వైద్యుల పరీక్షలు..!

Tomoto Fever: టమాట జ్వరంతో కేరళలో దాదాపుగా వందమందికిపైగా చిన్నారులు ఆసుపత్రి పాలయ్యారు. డెంగ్యూ, చికెన్‌ గూన్యా వ్యాధిన పడ్డ చిన్నారుల్లో ఈ ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2022, 03:15 PM IST
  • కేరళను వణికిస్తున్న కొత్త రకం ఫ్లూ
  • చిన్నారులపై టమాట ఫ్లూ ప్రభావం
  • ఇప్పటికే వందమందికి ఇన్ఫెక్షన్‌
Tomoto Fever: చిన్నారులపై టమాట ఫ్లూ ప్రభావం, తమిళనాడు కేరళ సరిహద్దుల్లో వైద్యుల పరీక్షలు..!

Tomoto Fever: కేరళను టమాట జ్వరం వణికిస్తోంది. దాదాపుగా ఇప్పటికే వంద మందికిపైగా చిన్నారులు ఈ వ్యాధి బారినపడ్డట్టు తెలుస్తోంది. కేరళ- తమిళనాడు సరిహద్దుల్లోని  వలయార్‌ గ్రామానికి ప్రత్యేక వైద్యబృందాలు చేరుకున్నాయి. ఐదు సంవత్సరాల వయసులోపు చిన్నారులపైనే ఇది ఎక్కువగా ప్రభావం చూపుతోంది.  కేరళను అనుకొని ఉన్న సరిహద్దు గ్రామాల్లో తమిళనాడు వైద్యఅధికారుల బృందం పరీక్షలు చేస్తోంది. జ్వరంతో బాధపడుతూ కొయంబత్తూర్‌ కు వస్తున్న చిన్నారులకు తమిళనాడు వైద్యాధికారుల బృందం సరిహద్దు వద్ద పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ వైద్యబృందంలో ఇద్దరు మెడికల్‌ ఆఫీసర్లు ఉన్నారు.

అసలు టమాట ఫ్లూ అంటే ఏమిటి..?
టమాట ఫ్లూ ప్రత్యేకించి  చిన్నారుల్లో కనిపిస్తోంది. ఇంతవరకు ఇది వైరల్‌ ఫీవరా.. లేక చికన్‌గున్యానా, డెంగ్యూ ఫీవరా అనేది ఇంకా నిర్ధారించలేదు.  ఈ ఫ్లూ వచ్చిన చిన్నారులకు చర్మంపై ఎర్రటి దద్దులు, చర్మ సంబంధిత వ్యాధులు ఏర్పడుతున్నాయి. అందువల్లే దీనికి టమాట ఫీవర్‌ అని పేరు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఫ్లూ సోకిన చిన్నారులకు డీ హైడ్రేషన్‌తో 102 డిగ్రీలకుపైబడి జ్వరం కూడా వస్తోంది.

టమాట ఫ్లూ లక్షణాలు:
టమాట ఫ్లూ సోకితే.. జ్వరంతో పాటు చర్మ సంబంధిత వ్యాధులు, వాంతులు, విరోచనాలు, కడుపు కింది భాగంలో దద్దర్లు, ముక్కుకారడం, దగ్గు, అలసట, ఒళ్లునొప్పులు లాంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

టమాట ఫ్లూ సోకేందుకు కారణాలు:
ఈ ఫ్లూ సోకేందుకు ఇప్పటివరకు ఇది కారణమని వైద్యులు నిర్ధారించలేదు. చికెన్‌ గూన్యా, డెంగ్యూ బారిన పడ్డ వారికే ఈ ఫ్లూ సోకుతుందని వైద్యులు అనుమానిస్తున్నారు. అందువల్లే టమాట ఫ్లూకు కూడా చికెన్‌ గూన్యా, డెంగ్యూకు ఇచ్చిన ట్రీట్‌ మెంట్‌ నే ఇస్తున్నారు.

Also Read: Telangana Diagnostic Centers: ప్రభుత్వ వైద్యులకు మంత్రి హరీశ్‌ రావు వార్నింగ్‌, మందుల చిటీ బయటకు వెళ్తే ఉద్యోగం ఉండదు..?

Also Read: Kohli On First-Ball Ducks: గోల్డెన్‌ డకౌట్స్‌ పై కోహ్లీ జోకులు, విమర్శలను పట్టించుకోనని వెల్లడి (వీడియో)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News