Election Results 2023: ఈశాన్యంలో కాషాయ రెపరెపలు.. మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇలా..

Assembly Election Results: దేశంలో బీజేపీ మరింత బలపడుతోంది. గురువారం త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. త్రిపురలో బీజేపీ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుండగా.. మిగిలిన రెండు రాష్ట్రాల్లో బీజేపీ సపోర్ట్‌తో ప్రభుత్వాలు ఏర్పాటుకానున్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2023, 08:56 PM IST
Election Results 2023: ఈశాన్యంలో కాషాయ రెపరెపలు.. మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇలా..

Assembly Election Results: ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో విజయం సాధించగా.. మేఘాలయలోనూ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. త్రిపురలో బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధించి.. వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. నాగాలాండ్‌లో బీజేపీ-ఎన్‌డీపీపీ కూటమి విజయం సాధించింది. మేఘాలయ ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. పీఏ సంగ్మా నాయకత్వంలోని నేషనల్‌ పీపుల్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 

మేఘాలయ ఎన్నికల ఫలితాలు ఇలా..

మొత్తం 59 స్థానాలు ఉన్న మేఘాలయలో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ కేవలం 2 స్థానాల్లో మాత్రమే గెలుపొంది. ఇక్కడ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా పార్టీ ఎన్‌పీపీ అత్యధిక స్థానాలను పొందింది. ఇప్పటివరకు ఎన్‌పీపీ 24 స్థానాల్లో విజయం సాధించగా.. 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. యూడీపీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. యూడీపీకి 11 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్, టీఎంసీలు పూర్తి శక్తితో పోరాడి కేవలం చెరో ఐదు సీట్లు మాత్రమే దక్కించుకున్నాయి. 

మేఘాలయలో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో ఉత్కంఠ మొదలైంది. ఎన్‌పీపీ అతిపెద్ద పార్టీగా అవతరిచడంతో కాన్రాడ్ సంగ్మా మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. అయితే మిత్రపక్షంగా ఎవరు ఉంటారనే ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఎన్‌పీపీ, బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని.. రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంతకుముందు కూడా ఎన్‌పీపీ బిజెపితో కలిసి ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపింది. ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అమిత్ షా నుంచి బీజేపీ సహకారం కోరారు సంగ్మా. 

నాగాలాండ్ ఎన్నికల ఫలితాలు ఇలా..

బీజేపీ, ఎన్డీపీపీ కూటమికి మరోసారి పట్టం కట్టారు నాగాలాండ్ ప్రజలు. నాగాలాండ్‌లోని మొత్తం 60 సీట్లలో 58 సీట్ల ఫలితాలు వెల్లడయ్యాయి. బీజేపీ-ఎన్డీపీపీ కూటమికి 37 సీట్లు వచ్చాయి. ఇక్కడ రెండో అతిపెద్ద పార్టీగా ఎన్సీపీ అవతరించింది. ఇప్పటివరకు 6 స్థానాల్లో విజయం సాధించి.. ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత ఎన్‌పీపీకి 5 సీట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థులు 4 స్థానాల్లో విజయం సాధించారు. చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన ఎల్‌జేపీ (రామ్‌విలాస్), రాందాస్ అథవాలే ఆర్‌పీఐ (అథవాలే), ఎన్‌పీఎఫ్‌లకు చెరో 2 సీట్లు వచ్చాయి. నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూకు కూడా ఒక సీటు దక్కింది.  

త్రిపురలో ఇలా..

త్రిపురలోని మొత్తం 60 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ 32 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. తిప్ర మోత పార్టీ 13 సీట్ల‌తో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. సీపీఐ(ఎం)కు 11 సీట్లు రాగా.. కాంగ్రెస్ 3 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఐపీఎఫ్‌టీకి ఒక సీటు వచ్చింది. త్రిపురలో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీకి అతిపెద్ద దెబ్బ తగిలింది. పూర్తిస్థాయిలో పోరాడినా టీఎంసీ ఖాతా కూడా తెరవలేదు. మాణిక్ సాహా సారథ్యంలో భారీ విజయం సాధించడం పట్ల బీజేపీ చాలా సంతోషంగా ఉందని.. అందుకే రాష్ట్ర నాయకత్వంలో ఎలాంటి మార్పు చేయకూడదని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మాణిక్ సాహా మళ్లీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నట్లు స్పష్టమవుతోంది. మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుండడంతో ఆ పార్టీ నాయకులు సంబురాలు చేసుకుంటున్నారు. 

Also Read: Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వానికి జనసేన సపోర్ట్.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: పవన్ కళ్యాణ్‌  

Also Read: Tax Saving Tips: ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వారికి గమనిక.. పన్ను ఇలా ఆదా చేసుకోండి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News