ఫొనీ తుపాను ప్రంచండ వేగంతో కదులుతోంది. తీరం దాటినప్పటికీ వేగం ఏమాత్రం తగ్గలేదు. ఈ ఉదయం 10.30 గంటల ప్రాంతంలో తీరందాటిన ఈ తీవ్ర పెనుతుపాను ధాటికి ఒడిశా తీరానికి చేరువయ్య సమయంలో 240 -245 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచాయి. గంటలు గడుస్తున్నప్పటికీ యావరేజ్ గా 200 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీస్తున్నాయి.
తీరని నష్టం మిలిల్చిన ఫొని
ప్రచండవేగంతో వీస్తున్న గాలులు, వర్షాలు పూరీ తీరాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. ఒడిశా తీరం చిగురుటాకులా కంపించిపోయింది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలన్న తేడా లేకుండా ఫణి ప్రభావానికి గురయ్యాయి. ఈదురు గాలులతో పాటు అతి భారీవర్షాలు ఒడిశాలోని తీరా ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. ఫొనీ ప్రభావం వల్ల ఏపీలో ఉత్తరాంధ్ర కూడా తీవ్ర నష్టాన్ని చవిచూసింది. ఒడిషాకు అవతలి సరిహద్దుల్లో ఉన్న జార్ఖండ్ పై కూడా ఫొనీ తన ప్రతాపాన్ని చూపిస్తోంది.