Farmers protest: రైతు ఉద్యమం..ఇక దేశవ్యాప్తం, 40 లక్షల ట్రాక్టర్లతో ర్యాలీ

Farmers protest: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఇప్పుడీ ఉద్యమంపై రైతు సంఘ నేత కీలక వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Feb 9, 2021, 08:54 PM IST
Farmers protest: రైతు ఉద్యమం..ఇక దేశవ్యాప్తం, 40 లక్షల ట్రాక్టర్లతో ర్యాలీ

Farmers protest: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఇప్పుడీ ఉద్యమంపై రైతు సంఘ నేత కీలక వ్యాఖ్యలు చేశారు.

కేంద్రం ( Central government ) తీసుకువచ్చిన నూతన చట్టాలకు ( New farm laws ) వ్యతిరేకంగా రైతులు దేశ రాజధానిలో 70 రోజులకు పైగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేశ్‌ తికాయత్ ( Rakesh tikiat )‌ కీలకమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు ఉద్యమాన్ని( Farmers protest ) దేశమంతా విస్తారిస్తామని ప్రకటించారు. హర్యానా, కురుక్షేత్ర జిల్లాలోని పెహోవాలో నిర్వమించిన కిసాన్ మహా పాంచాయతీలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ( Pm Narendra modi ) ఇప్పటి వరకూ ఒక్క ఆందోళనలో కూడా పాల్గొనలేదని చెప్పారు. ప్రధాని పని కేవలం దేశాన్ని విడగొట్టడమేనని చెప్పారు. ఆందోళన జీవుల గురించి ఆయనకేం తెలుసని ప్రశ్నించారు. భగత్‌ సింగ్‌ నుంచి బీజేపీ నాయుకులు ఎల్‌కే అద్వానీ వరకు ప్రతి ఒక్కరు ఆందోళనలో పాల్గొన్నారు గానీ..మోదీ మాత్రం పాల్గొనలేదని చెప్పారు. అందుకే ఆయనకు ఆందోళనల గురించి తెలియదని మండిపడ్డారు.

అక్టోబర్ 2వ తేదీ వరకూ రైతు ఆందోళన ( Farmers protest )ను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆ తరువాత కూడా ఉద్యమం ఆగదని..విడతలవారీగా రైతులంతా పాల్గొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. త్వరలో..40 లక్షల ట్రాక్టర్లతో భారీ ర్యాలీ ( Rally with 40 lakh tractors ) నిర్వహిస్తామని తెలిపారు.  

Also read: PM Kisan Samman Nidhi నిబంధనల్లో భారీ మార్పులు, ఇకపై వారికి రూ.6 వేలు జమ కావు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News