ప్రధాని నివాసంలో అగ్ని ప్రమాదం వార్తలు.. స్పందించిన పీఎంవో!

ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్టు వెలువడిన వార్తలు ఒకింత కలకలం సృష్టించాయి. కరెంట్ తీగల్లో షార్ట్ సర్క్యూ ట్ కారణంగా మంటలు చెలరేగగా.. 9 అగ్నిమాపక యంత్రాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.

Last Updated : Dec 30, 2019, 09:38 PM IST
ప్రధాని నివాసంలో అగ్ని ప్రమాదం వార్తలు.. స్పందించిన పీఎంవో!

న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్టు వెలువడిన వార్తలు ఒకింత కలకలం సృష్టించాయి. కరెంట్ తీగల్లో షార్ట్ సర్క్యూ ట్ కారణంగా మంటలు చెలరేగగా.. 9 అగ్నిమాపక యంత్రాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. సోమవారం రాత్రి 7.25 గంటల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రధాని మోదీ నివాసంలో అగ్ని ప్రమాదం ఘటనపై ట్విటర్ స్పందించిన ప్రధాని కార్యాలయం.. ఈ ఘటన ప్రధాని నివాసంలో కానీ లేదా కార్యాలయంలో కానీ జరగలేదని వివరణ ఇచ్చింది.

లోక్ కళ్యాణ్ మార్గ్ సముదాయంలోని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) కార్యాలయంలో రిసెప్షన్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని పీఎంఓ స్పష్టంచేసింది.

Trending News