కరోనా కాటుకు తమిళనాడులో తొలి మరణం.. దేశంలో 11కి చేరిన కరోనా మరణాలు

ప్రాణాంతక కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారి బారిన పడి దేశంలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. భారత్‌‌లో కరోనా మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ లాక్ డౌన్ ప్రకటించడం తెలిసిందే.

Last Updated : Mar 25, 2020, 08:06 AM IST
కరోనా కాటుకు తమిళనాడులో తొలి మరణం.. దేశంలో 11కి చేరిన కరోనా మరణాలు

చెన్నై: ప్రాణాంతక కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారి బారిన పడి దేశంలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్‌‌లో కరోనా మరణాల సంఖ్య 11కు చేరుకుంది. తాజా కేసు తమిళనాడులో సంభవించగా.. రాష్ట్రంలో ఇదే తొలి కరోనా మరణం. తమిళనాడుకు చెందిన 54ఏళ్ల వ్యక్తి జలుబు, దగ్గు, జ్వరంతో ఇటీవల మధురైలోని రాజాజీ ఆసుపత్రిలో చేరాడు. అతడికి కోవిడ్19 (COVID-19)టెస్టులు చేయగా పాజిటీవ్‌గా తేలింది. ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సెలవుల్లోనూ పూర్తి జీతం

ఆ పేషెంట్‌ను ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అప్పటికే సీఓపీడీ, హైపర్ టెన్షన్, బయాబెటిస్ సమస్యలతో సతమతమవుతున్న ఆ వ్యక్తి రోగనిరోధక శక్తి నశించింది. దీంతో బుధవారం ఉదయం ఆ వ్యక్తి చనిపోయాడని, కరోనాతో తమిళనాడులో తొలి మరణం నమోదైందని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 18కి చేరుకోగా, దేశంలో 519 మందికి కరోనా సోకడం తెలిసిందే.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

హాలీవుడ్ బుట్టబొమ్మ Bold Photos

 

Trending News