ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఇక లేరు.. ఆమె రాజకీయ ప్రస్థానం..

ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఇక లేరు.. ఆమె రాజకీయ ప్రస్థానం..

Last Updated : Jul 20, 2019, 05:50 PM IST
ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఇక లేరు.. ఆమె రాజకీయ ప్రస్థానం..

ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఇక లేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఫోర్టిస్ ఎస్కార్ట్స్ ఆస్పత్రిలో చేరిన ఆమె శనివారం మధ్యాహ్నం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయస్సు 81 ఏళ్లు. 1938 మార్చి 31న పంజాబ్‌లోని కపుర్తలలో జన్మించిన షీలా దీక్షిత్‌ రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్నారు. 1984-89 మధ్య కాలంలో ఉత్తర్ ప్రదేశ్‌లోని కన్నౌజ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా సేవలు అందించిన షీలా దీక్షిత్.. ఆ తర్వాత 1998-2013 వరకు వరుసగా మూడు పర్యాయాలు ఢిల్లీ ముఖ్యమంత్రి గెలిచి 15 ఏళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. 2014 ఎన్నికల్లో ఓటమిపాలై ఢిల్లీ సీఎం పీఠం నుంచి దిగిపోయిన అనంతరం 2014 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఆమె కేరళ గవర్నర్‌గానూ సేవలు అందించారు.

షీలా దీక్షిత్ మృతిపట్ల యూపిఏ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర అగ్రనేతలు తీవ్ర సంతాపం ప్రకటించారు. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు నిగం బోద్ ఘాట్‌లో షీలా దీక్షిత్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Trending News