ఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి , బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ (66) కి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రముఖ మీడియా కథనం ప్రకారం ప్రస్తుతం జైట్లీని ఎయిమ్స్ కార్డియాలజీ విభాగంలో ఉంచినట్లు తెలిసింది. ఎండోక్రినాలజిస్ట్, నెఫ్రోలాజిస్ట్ మరియు కార్డియాలజిస్ట్ బృందం పర్యవేక్షణలో జైట్లీకి చికిత్స అందిస్తున్నారు .ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. దీనికిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.గత కొంత కాలం నుంచి గుండె, మూత్రపిండ సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవలె జైట్లీకి గత ఏడాది కిడ్నీ మార్పిడి జరిగింది. గత జనవరిలో అమెరికాలో మెడికల్ చెక్ అప్ కోసం వెళ్లి వచ్చారు.
ఆరోగ్యం పరిస్థితి క్షిణించడంతో అరుణ్ జైట్లీ 2019 లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం 2019 మేలో అధికారంలోకి వచ్చిన తరువాత జైట్లీకి కేబినెట్ లో చోటు దక్కలేదు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేనందున తాను ఎలాంటి బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా లేనని ప్రధాని మేడీకి జైట్లీ లేఖ రాయడంతో ఈ సారి కేబినెట్ చోటు కల్పించలేదు. ఇదిలా ఉంటే బీజేపీ మూలస్థంబమైన అరుణ్ జైట్లీ అస్వస్థతకు గురయ్యారనే వార్త తెలియగానే బీజేపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు