Former Punjab CM Amarinder Singh Tested Positive: దేశంలో కరోనా (Covid-19) కోరలు చాస్తోంది. తాజా ఉద్ధృతిలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు కొవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌కు (Former Punjab CM Amarinder Singh Tested Positive) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.
''నాకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాను. నన్ను ఇటీవల కలిసిన వారందరూ కరోనా టెస్టు చేయించుకోండి'' అంటూ...అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు. ఇటీవల ఆయన భార్య, కాంగ్రెస్ ఎంపీ ప్రణీత్ కౌర్ (Preneet Kaur) కూడా కరోనా బారిన పడ్డారు. ఇటీవల సీఎం పదవికి రాజీనామా చేసిన 79 ఏళ్ల అమరీందర్.. 'పంజాబ్ లోక్ కాంగ్రెస్' పార్టీని స్థాపించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
I have tested positive for #Covid with mild symptoms. Have isolated myself and request all those who came in contact with me to get themselves tested.
— Capt.Amarinder Singh (@capt_amarinder) January 12, 2022
తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కూడా కొవిడ్ పాజిటివ్‌గా (Nitin Gadkari tested Corona Positive) నిర్ధారణ అయింది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సహా పలువురికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. తెలుగు రాష్ట్రాల్లో పలువురు నేతలు కూడా కరోనా బారిన పడ్డారు. ఏపీ మంత్రి కొడాలి నాని ((Kodali Nani), తెదేపా నేతలు వంగవీటి రాధా, పయ్యావుల కేశవ్, తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలకు కరోనా సోకింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి