Ganesh Chaturthi 2021 in Karnataka: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా సెప్టెంబరు 10న బెంగళూరులో మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్టు బృహత్ బెంగళూరు మహానగర పాలికె (BBMP) ప్రకటించింది. వినాయక చవితి నాడు జంతువులను వధించకూడదని, మాంసం విక్రయాలు జరపరాదని స్పష్టంచేస్తూ బీబీఎంపీ జాయింట్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. వినాయక చవితి ఉత్సవాలు, గణేష్ విగ్రహాల నిమజ్జనం (Ganesh idols immersion) సందర్భంగా జరిగే వేడుకల్లో 20 మందికి మించి పాల్గొనకూడదని ఇప్పటికే కర్ణాటక సర్కార్ నిబంధనలు విధించగా తాజాగా బృహత్ బెంగళూరు మహానగర పాలికె సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
Night curfew: కరోనా వ్యాప్తి నివారణకు నైట్ కర్ఫ్యూ:
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా రాత్రి పూట బహిరంగ స్థలాల్లో జనం ఒక్కచోట గుమిగూడే ప్రమాదం ఉన్నందున.. రాత్రి 9 గంటలు దాటిన అనంతరం ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకూ అనుమతించే ప్రసక్తే లేకుండా నైట్ కర్ఫ్యూ తరహా వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
Also read : Ganesh chaturthi in AP: ఏపీలో వినాయక చవితి ఉత్సవాలపై AP High court నిర్ణయం
Green Ganesha idols: మట్టి విగ్రహాలకే అనుమతి, అన్నదానం, ప్రసాదం పంపిణీకి నో:
పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని కేవలం మట్టి విగ్రహాలకే అనుమతులు ఇవ్వనున్నట్టు కర్ణాటక సర్కారు స్పష్టంచేసింది. వినాయక చవితి ఉత్సవాలు (Vinayaka Chavithi celebrations) సందర్భంగా ప్రతీ సంవత్సరం అన్నదానం, ప్రసాదం పంపిణీ జరగడం ఆనవాయితీ కాగా.. కరోనావైరస్ వ్యాప్తి నివారణ కోసం ఈ సంవత్సరం అన్నదానం లేదా ప్రసాదం పంపిణీ లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టడానికి వీల్లేదని కొవిడ్-19 మార్గదర్శకాలు స్పష్టంచేస్తున్నాయి.
Also read : Ganesh Chaturthi 2021: వినాయక చవితి రద్దీ దృష్ట్యా 261 Ganapati special trains
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook