Sabarimala Pilgrims: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు పౌర విమానయాన శాఖ సెక్యూరిటీ విభాగం గుడ్‌న్యూస్ విన్పించింది. ఇక నుంచి విమానంలో తమ వెంట ఇరుముడి సామగ్రిని ముఖ్యంగా కొబ్బరి కాయను తీసుకెళ్లేందుకు అనుమతించింది. అయితే పూర్తిగా స్కానింగ్ పరీక్షల తరువాతే అనుమతిస్తారు.
అయ్యప్ప భక్తులు విమానంలో ప్రయాణించాలంటే కొన్ని ఇబ్బందులుండేవి. ముఖ్యంగా ఇరుముడి సామగ్రి, కొబ్బరికాయలు తీసుకెళ్లేందుకు వీలుండేది కాదు. అయితే ఎక్స్ రే, ఎక్స్‌ప్లోజివ్ ట్రేస్ డిటెక్టర్ , ఫిజికల్ పరీక్షల తరువాతే వీటిని విమానంలో వెంట తీసుకెళ్లేందుకు కేబిన్ లగేజ్ కింద అనుమతిస్తారు. నవంబర్ మూడో వారం నుంచి అయ్యప్ప భక్తుల కోసం రెండు నెలల వరకూ శబరిమల ఆలయం తెరుస్తారు. మిడ్ నవంబర్ నుంచి జనవరి ఆఖరు వరకూ శబరిమలలోని అయ్యప్ప ఆలయం తెరిచి ఉంటుంది. కేరళలోని శబరిమల ఆలయానికి వెళ్లే భక్తులకు ఇక ఇప్పుడు ఉపశమనం కల్గించే వార్త ఇది. భక్తులు తమ వెంట కేబిన్ లగేజ్ కింద కొబ్బరి కాయల్ని తీసుకెళ్లవచ్చు. ఈ అవకాశం జనవరి 20 వరకూ విమానాల్లో అనుమతి ఉంటుంది.
పరిమిత కాలానికి భక్తులు తమ వెంట కొబ్బరి కాయలు తీసుకెళ్లేందుకు ఏవియేషన్ సెక్యూరిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం కేబిన్ లగేజ్‌లో ఫ్లేమబుల్ వస్తువనే కారణంతో కొబ్బరి కాయలు తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. అయితే ఇక నుంచి ఎక్స్ రే, ఎక్స్‌ప్లోజివ్ డిటెక్టర్, ఫిజికల్ పరీక్షల అనంతరం కొబ్బరి కాయల్ని తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అయ్యప్ప భక్తులు మాల వేసినప్పుడు ధరించే ఇరుముడిలో కొబ్బరికాయ తప్పనిసరిగా ఉండాలి.
అయ్యప్ప మాల ధరించినప్పుడు ఇరుముడి కట్టడం అనేది ఓ సాంప్రదాయం. ఇది లేకుండా మాల ధారణ సాధ్యం కాదు. ఇప్పుడు విమానయాన శాఖ అనుమతివ్వడంతో అయ్యప్ప భక్తులకు పెద్ద రిలీఫ్ కలగనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.