ఆర్థిక లావాదేవీలు జరపడానికి దేశంలో ఇప్పటికే అనేక బ్యాంకులు ఉన్నాయని.. కొత్తగా ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేసే అవసరం లేదని కేంద్ర మంత్రి ముక్తర్ అబ్బాస్ నక్వీ తెలిపారు. హైదరాబాద్ లో ఒక కార్యాక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన పిటిఐ అడిగిన ప్రశ్నకు బదులుగా పై విధంగా స్పందించారు. ఇస్లామిక్ లేదా షరియా వ్యవస్థలో ఆర్థిక లావాదేవీలకు వడ్డీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.
భారత దేశం ఒక లౌకిక దేశం.. ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ అన్ని మతాల ప్రజలు, వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. మత ప్రాతిపదికన బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించదని తెలిపారు. ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని మైనార్టీ వ్యవహారాల మంత్రి చెప్పారు.