అమ్మకానికి ఎయిర్ ఇండియా

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ. . ఎయిర్ ఇండియా.. ఎట్టకేలకు అమ్మకానికి సిద్ధమైంది. వరుసగా నష్టాలు చవి చూస్తున్న ఎయిర్ ఇండియా విమానయాన సంస్థను అమ్మేయాలనే ప్రతిపాదనలు ఇప్పటికే వచ్చాయి.

Last Updated : Jan 27, 2020, 02:03 PM IST
అమ్మకానికి ఎయిర్ ఇండియా

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ. . ఎయిర్ ఇండియా.. ఎట్టకేలకు అమ్మకానికి సిద్ధమైంది. వరుసగా నష్టాలు చవి చూస్తున్న ఎయిర్ ఇండియా విమానయాన సంస్థను అమ్మేయాలనే ప్రతిపాదనలు ఇప్పటికే వచ్చాయి. ఐతే పాక్షికంగా విక్రయించాలని .. గతంలో  భారత ప్రభుత్వం నిర్ణయించింది.  పాక్షిక విక్రయాన్ని సేవల వరకే పరిమితం చేయాలని నిర్ణయించింది. కానీ ఈ నిర్ణయంతో పెద్దగా ఒరిగిందేమీ లేదు. విమానయాన సంస్థను కొనుగోలు చేయడానికి ఏ సంస్థ ముందుకు రాలేదు. మరోవైపు వరుస నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో సంస్థను  పూర్తిగా అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 
మార్చి 17న టెండర్లకు తుది గడువు 
ఎయిర్ ఇండియా విమానయాన సంస్థను అమ్మేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మెమోరాండమ్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 202 మార్చి 17 లోగా బిడ్డర్లు .. టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. మార్చి 31న బిడ్డర్ల క్వాలిఫికేషన్ ను నోటిఫై చేస్తారు. దేశీయ, అంతర్జాతీయంగా విమానయాన సేవలు అందిస్తున్న ఎయిర్ ఇండియా .. 2007 మార్చి 30న ప్రారంభమైంది. 

Trending News