YouTube channels Ban: 35 పాకిస్థాన్ యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం వేటు- కారణాలివే..

YouTube channels Ban: భారత్​పై విష ప్రచారం చేస్తున్న పాక్​ యూట్యూబ్​ ఛానెళ్లపై కేంద్రం చర్యలు ప్రారంభించింది. పలు సోషల్​ మీడియా అకౌంట్లనూ బ్యాన్ చేసింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2022, 11:26 PM IST
  • మరోసారి పాక్ యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం కొరడా
  • నకిలీ సమాచారం పోస్ట్​ చేస్తున్న ఛానెళ్లపై బ్యాన్​
  • పలు వెబ్​సైట్లు, సోషల్​ మీడియా అకౌంట్లపైనా నిషేధం
YouTube channels Ban: 35 పాకిస్థాన్ యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం వేటు- కారణాలివే..

YouTube channels Ban: నకిలీ సమాచారంతో భారత్​పై తప్పుడు ప్రచారాలు చేస్తున్న పాకిస్థానీ యూట్యూబ్​ ఛానెళ్లపై కేంద్రం కొరడా ఝులిపించింది. మొత్తం 35 పాకిస్థానీ యూట్యూబ్ ఛానెళ్లపై వేటు వేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ (ఐ అండ్​ బీ) (Pakistan YouTube Channels Ban) వెల్లడించింది.

ఇదే కారణాలతో.. పాకిస్థాన్​ నుంచి అపరేట్ చేస్తున్న.. రెండు వెబ్​సైట్లు, ఇన్​స్టాగ్రామ్ అకౌంట్లు, రెండు ట్విట్టర్ అకౌంట్లు, ఓ ఫేస్​బుక్ అకౌంట్​ పైనా బ్యాన్ (anti-India propaganda) విధించింది.

గత ఏడాది డిసెంబర్​లో కూడా 'యాంటీ ఇండియా' కంటెంట్​ను వ్యాప్తి చేస్తున్నాయనే కారణంతో 20 యూట్యూ బ్​ ఛానెళ్లను బ్యాన్​ చేసింది (Ban on anti India Youtube Channels) ప్రభుత్వం.

ఇక తాజా యూట్యూబ్​ ఛానెళ్లు, సోషల్ మీడియా అకౌంట్లపై బ్యాన్​ అంశంపై ఐ అండ్ బీ కార్యదర్శి అపూర్వ చంద్ర పలు కీలక విషయాలు (Information and Broadcast ministry) వెల్లడించారు.

ఆయా యూట్యూబ్​ ఛానెళ్లలన్నీ పోస్ట్​ చేసిన కంటెంట్​కు దాదాపు 130 కోట్ల వ్యూస్ ఉన్నట్లు తెలిపారు. ఆయా ఛానెళ్లకు 1.2 కోట్ల సబ్​స్క్రైబర్లు ఉన్నారని పేర్కొన్నారు. బ్యాన్​ చేసిన యూట్యూబ్​ ఛానెళ్లు, వెబ్​సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లు అన్ని పాకిస్థాన్​ కేంద్రంగానే నడుస్తున్నట్లు ఇంటెలీజెన్స్​ వర్గాల ద్వారా తెలుసుకున్నట్లు వివరించారు. ఆ సమాచారం ఆధారంగానే చర్యలకు ఉపక్రమించినట్లు పేర్కొన్నారు.

ఆయా ఛానెళ్లలో ఎలాంటి కెంటెంట్​ ఉందంటే..

బ్యాన్​కు గురైన ఛానెళ్లలో ఖబర్ విత్ ఫ్యాక్ట్స్​, గ్లోబల్ ట్రూత్​, ఇన్ఫర్మేషన్​ హబ్, అప్నీ దునియా టీవీ, ఖోజీ టీవీ వంటివి ముఖ్యమైనవిగా పేర్కొంది ఐ అండ్​ బీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్​, 2000లోని సెక్షన్​ 69-ఏ ఆధారంగానే వాటిని బ్యాన్ చేసినట్లు (Youtube channels blocked in india) స్పష్టం చేసింది.

ఆయా ఛానెళ్లలో.. గత ఏడాది డిసెంబర్​లో హెలికాప్టర్​ ప్రమాదంలో దుర్మరణం పాలైన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ (Fake news on Gen Bipin Rawat)​, జమ్ము కశ్మీర్​ సహా వివిధ సున్నితమైన అంశాలపై (Fake news on Jammu Kashmir) తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు వివరించింది ఐ అండ్​ బీ.

Also read: Minors Inspired By Pushpa : అల్లు అర్జున్ 'పుష్ప' చూసి యువకుడిని చంపిన ముగ్గురు మైనర్లు.. వెలుగులోకి సంచలన నిజాలు

Also read: Netaji grand statue : ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం, ప్రధాని మోదీ వెల్లడి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News