Gyanvapi Masjid Surve: దేశంలో ప్రకంపనలు రేపుతున్న ఉత్తర్ ప్రదేశ్ జ్ఞాన్‌వాపి మసీదు వివాదంలో సరికొత్త అంశాలు వెలుగులోనికి వస్తున్నాయి. కోర్టు ఆదేశాలతో మూడు రోజుల పాటు నిర్వహించిన సర్వే నివేదికలో సంచలన విషయాలు ఉన్నాయి. జ్ఞాన్‌వాపి మసీదులో ఆలయ అవశేషాలు ఉన్నట్లు కమిటీ నిర్ధారించింది. మసీదు గోడలపై హిందూ రాతలు ఉన్నాయని నివేదికలో ఉంది. త్రిశూలం, శేషనాగు పడగ, ఢమరుకం, గోడలపై కమలం గుర్తులు, హిందూ దేవతలకు సంబంధించిన బొమ్మలు కనిపించినట్లు కమిటీ పేర్కొంది.
జ్ఞాన్‌వాపి మసీదు ఆవరణలో వీడియోగ్రఫీకి సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్ లో గురువారం కోర్టుకు సమర్పించారు. జ్ఞాన్‌వాపి మసీదులో పూజ చేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలని ఐదుగురు మహిళలు కోర్టుకు విన్నవించారు. మసీదులో హిందూ దేవుళ్లు, దేవతల విగ్రహాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. దీంతో కోర్టు జ్ఞాన్‌వాపి మసీదు ఆవరణలో వీడియో తీయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో వీడియోగ్రఫీ సర్వే చేశారు. నివేదికను కోర్టుకు సమర్పించారు. ఆ సర్వే నివేదిక యొక్క కాపీని పిటిషనర్ల తరపు న్యాయవాదులు లీక్ చేశారు.
జ్ఞాన్‌వాపి మసీదు సర్వేలో సంచలన విషయాలు?
1. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో చెక్కబడిన త్రిశూలాలు, తామర పువ్వులు మరియు హిందూ మతానికి చెందిన కొన్ని పురాతన శిల్పాలు ఉన్నాయి. గతంలో మసీదులో శివలింగం కనిపించిందని హిందుత్వవాదులు ప్రకటించారు.
2. మసీదులోని నేలమాళిగలోని స్తంభాలపై పువ్వులు మరియు కలశ గుర్తులు చెక్కబడ్డాయి. స్తంభంపై పురాతన హిందీ భాషలోని కొన్ని పదాలు చెక్కబడి ఉన్నాయి. నేలమాళిగ గోడలపై త్రిశూల గుర్తులు ఉన్నాయి. మసీదుకు పడమటి వైపున రెండు పెద్ద స్తంభాలు మరియు ఒక తోరణం కనిపించాయి. అవి పురాతన దేవాలయంలో భాగమని తెలుస్తోంది.
3. మసీదు మూడవ గోపురం కింద ఒక రాయిపై తామరపువ్వు గుర్తు చెక్కబడి ఉందని కూడా నివేదిక పేర్కొంది. మసీదు ఆవరణలో రెండున్నర అడుగుల పొడవైన కట్టడం కనిపించింది. ఇది శివలింగమని పిటిషనర్లు పేర్కొన్నారు.
సర్వేలో శివలింగం బయటపడినట్లు ముందే లీక్ ఇచ్చారు సర్వే అధికారి. అతనిని కోర్టు విధుల నుంచి తప్పించింది. ఇప్పుడు మరికొన్ని వస్తువులు బయటపడినట్లు వారణాసి కోర్టుకు నివేదిక సమర్పించిన సర్వేయర్లు చెప్పారు. జ్ఞానవాసి మసీదు నుండి వచ్చిన నివేదికపై కోర్టు ఎటువంటి వ్యాఖ్య లేదు. అయితే కోర్టు చూడకముందే నివేదికను ఎలా బహిరంగ పరుస్తారని పలువురు తప్పుపడుతున్నారు. మరోవైపు మసీదులో హిందూ దేవతలకు సంబంధించిన అవశేషాలు కనిపించాయి కాబట్టి మసీదు మొత్తాన్ని పురావస్తు శాఖ సర్వే చేయాలనే డిమాండ్ వస్తోంది. ఇక శివలింగం కనిపించిన స్థలంలో పూజలకు అనుమతి ఇవ్వాలని కాశి విశ్వానాథ ఆలయ ట్రస్ట్ కోర్టుకు విన్నవించింది.
READ ALSO: Telangana Govt: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook