Telangana Govt: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంచాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ఈక్రమంలో కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసు ఉద్యోగాలకు వయో పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వయో పరిమితిని మరో రెండేళ్లకు పెంచింది. ఈమేరకు అధికారిక ప్రకటన వెలువడింది.
తెలంగాణలో 95 శాతం స్థానికత మొదటిసారి అమలు అవుతోంది. రెండేళ్ల కరోనా కారణంగా అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇటీవల సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈక్రమంలోనే తెలంగాణ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే ఈ నిర్ణయం అమలు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించారు.
సీఎం కేసీఆర్(CM KCR) నిర్ణయంపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నారు. కరోనా కారణంగా తాము చాలా నష్టపోయామంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని అంటున్నారు. వయో పరిమితి పెరగడంతో అభ్యర్థులంతా స్టడీస్‌పై దృష్టి పెట్టారు. ఇటీవల అభ్యర్థులంతా హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఇదే అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈనేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Also read:TSRTC Free Service: 10వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం!
Also read:Supreme Court:దిశా కేసును ప్రత్యేకంగా మానిటర్ చేయలేదు..సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook