54 People Died due to Heat Stroke: దారుణం.. వడదెబ్బతో 72 గంటల్లో 54 మంది మృతి

54 People Died due to Heat Stroke in UP: యూపీలో బల్లియా ప్రాంతంలో రోజు రోజుకు ఉష్ణోగ్రాలు పెరగడం కారణంగా వడదెబ్బతో  54 మంది మరణించారని జిల్లా ఇన్‌ఛార్జ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎస్‌కే యాదవ్‌ వెల్లడించారు. స్ట్రెచర్లు అందుబాటులో లేక చాలా మంది రోగులను భుజాలపై ఎక్కించుకుని వెళ్లే దయనీయ పరిస్థితి ఏర్పడింది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 20, 2023, 06:22 PM IST
54 People Died due to Heat Stroke: దారుణం.. వడదెబ్బతో 72 గంటల్లో 54 మంది మృతి

54 People Died due to Heat Stroke in UP: కొన్ని రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల కారణంగా వానలు దంచికొడుతుంటే, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం భానుడు బగ బగ మండుతున్నాడు. యూపీలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అంతేకాకుండా వేడిగాలుల ప్రభావం కూడా ఎక్కువే ఉందని వాతావరణ అధికారులు తెలుపులున్నారు. చాలా ప్రదేశాల్లో వేడిగాలుల కారణంగా ఇళ్లలో నుంచి జనాలు బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ గాలులకు తోడు ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరి చాలా మంది వడదెబ్బ బారిన పడుతున్నారు. ఇప్పటికి వడదెబ్బ కారణంగా ఎంతో మంది పిల్లలు, వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు.  

యూపీలో బల్లియా ప్రాంతంలో ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. వడదెబ్బ కారణంగా ఇప్పటికీ 54 మంది మరణించారని ప్రభుత్వ అధికారులు తెలిపారు.  జూన్ 15, 16, 17 తేదీల్లో అంటే మూడు రోజుల్లో దాదాపు 400 మంది జ్వరం, ఊపిరి ఆడకపోవడం, డిహైడ్రేషన్‌ సమస్యలతో జిల్లా ఆసుపత్రిలో చేరారని వైద్యులు చెబుతున్నారు. ఈ జూన్ 15న 23 మరణించగా.. జూన్ 17 సాయంత్రం 4 గంటల వరకు మొత్తం 54 మంది మరణించారని వైద్యలు వెల్లడించారు. ఎండాల తీవ్రత మరింత పెరిగితే మరణాల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.  

Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్

ఈ మరణాల సంఖ్య పై లక్నో బృందం విచారణ చేపట్టింది. అధిక వేడి, చలి కారణంగా తీవ్ర శ్వాసకోశ సమస్యలు వస్తాయని ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్యలు, మధుమేహం ఉన్నవారిలో ఇలాంటి సమస్యలు రావడం కారణంగా మరణించే అవకాశాలున్నాయని బృందం పేర్కొంది. ఇలాంటి వ్యాధులున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తుల తీసుకుంటేనే మంచిదని బృందం సూచించింది. 

స్ట్రెచర్స్‌ కూడా అందుబాటులో లేవు:
బల్లియా జిల్లా ఆస్పత్రిలో ఇప్పటి వరకు మూడు రోజుల్లో 400 మంది రోగులు ఆసుపత్రిలో చేరారని ఇన్‌ఛార్జ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎస్‌కే యాదవ్‌ అన్నారు. గత మూడు రోజుల్లో ఇప్పటివరకు 54 మంది రోగులు చనిపోగా.. మూడు రోజుల్లో చాలా మంది ఆసుపత్రిలో చేరి, ప్రాణాలు కోల్పోయారన్నారు. మున్ముందు వచ్చే రోగులకు స్ట్రెచర్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి నెలకొందని సూపరింటెండెంట్‌ పేర్కొన్నారు. ఆస్పత్రిలో స్ట్రెచర్లు లేక రోగులను భుజాలపై ఎక్కించుకుని ఎమర్జెన్సీకి తీసుకెళ్తున్నారన్నారు.

Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News