Heavy Rains Alert: ఉత్తరాదిన భారీ వర్షాలు, ఉత్తరాఖండ్, ఢిల్లీలో వర్షాల బెడద

Heavy Rains Alert: అటు కేరళలో వరదలు, ఇటు ఉత్తరాదిన భారీ వర్షాలతో దేశం వణికిపోతోంది. ఉత్తరాదిన వరుసగా రెండ్రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. అటు దక్షిణాదిన సైతం ఎడతెరిపిలేని వర్షాలతో బెంబేలెత్తిస్తున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 19, 2021, 11:53 AM IST
  • ఉత్తరాదిన భారీ వర్షాలు, ఉత్తరాఖండ్, ఢిల్లీలో వరుసగా రెండోరోజు వర్షాలు
  • పంపానదిలో నీటిమట్టం పెరుగుతుండటంతో శబరిమల పర్యటన నిలిపివేత
  • ఉత్తరాఖండ్ భారీ వర్షాలతో చార్‌థామ్ యాత్రకు బ్రేక్
Heavy Rains Alert: ఉత్తరాదిన భారీ వర్షాలు, ఉత్తరాఖండ్, ఢిల్లీలో వర్షాల బెడద

Heavy Rains Alert: అటు కేరళలో వరదలు, ఇటు ఉత్తరాదిన భారీ వర్షాలతో దేశం వణికిపోతోంది. ఉత్తరాదిన వరుసగా రెండ్రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. అటు దక్షిణాదిన సైతం ఎడతెరిపిలేని వర్షాలతో బెంబేలెత్తిస్తున్నాయి.

దక్షిణాదిన ముఖ్యంగా కేరళలో కురిసిన భారీ వర్షాలతో(Kerala Heavy Rains) ఆ రాష్ట్రంలో వరద నీరు ముంచెత్తింది. కేరళలో వరుణుడి ప్రతాపం ఇంకా కొనసాగుతూనే ఉంది. భారీ వర్షాలతో వరదలు పోటెత్తుతున్నాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. జన జీవనం స్తంభించిపోతోంది. భారీ వర్షాల కారణంగా శబరిమల యాత్రను(Sabarimala Yatra)తాత్కాలికంగా నిలిపివేశారు. రాష్ట్రంలో నిండుకుండల్లా మారిన 10 డ్యామ్‌లకు రెడ్‌‌అలర్ట్‌ ప్రకటించారు. అటు పంపా నదిలో నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నెల 12వ తేదీ నుంచి ఇప్పటిదాకా వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 38 మరణించినట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది. 

మరోవైపు ఉత్తరాదిన సైతం భారీ వర్షాలు(Heavy Rains)ప్రారంభమయ్యాయి. ఢిల్లీతోపాటు రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌తోపాటు దక్షిణాదిన తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోనూ సోమవారం ఎడతెరిపిలేని వర్షాలు బెంబేలెత్తించాయి. ఉత్తరాఖండ్‌ను వర్షాలు వణికిస్తున్నాయి. వరుసగా రెండో రోజు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వర్షాల కారణంగా చార్‌థామ్ యాత్రను(Chardham Yatra) నిలిపివేశారు. సురక్షితమైన ప్రాంతాల్లోనే బస చేయాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ సూచించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా(Amit shah)సీఎం ఫోన్‌లో మాట్లాడారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అటు దేశ రాజధాని ఢిల్లీలో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. 1960 నుంచి ఇప్పటి వరకూ ఈ అక్టోబర్ నెల అత్యధిక వర్షపాతం కురిసినట్టు రికార్డుకెక్కింది.1960 అక్టోబర్ నెలలో 93.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా..ఈ ఏడాది ఇప్పటి వరకూ 94.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నిన్న ఆదివారం ఒక్కరోజే ఢిల్లీలో (Delhi Heavy Rains)రికార్డు స్థాయిలో 87.9 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఇవాళ కూడా ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Also read: Tamilnadu: తమిళనాడులో మరో కొత్త పథకం, ఇంటి వద్దకే దంత వైద్య సేవలు, విద్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News