వలస జనాభా అంతా ముంబయి వస్తే ఎలా?

ముంబయి ప్రాంతానికి మిగతా నగరాల నుండి వచ్చేవారి వల్లే విపత్తులు సంభవిస్తున్నాయని అలనాటి నటి మరియు బీజేపీ ఎంపీ హేమమాలిని అభిప్రాయపడ్డారు.

Last Updated : Dec 29, 2017, 05:09 PM IST
వలస జనాభా అంతా ముంబయి వస్తే ఎలా?

ముంబయి ప్రాంతానికి మిగతా నగరాల నుండి వచ్చేవారి వల్లే విపత్తులు సంభవిస్తున్నాయని అలనాటి నటి మరియు బీజేపీ ఎంపీ హేమమాలిని అభిప్రాయపడ్డారు. ఇటీవలే ముంబయిలోని కమలా మిల్స్ ప్రాంతంలో ఒక పబ్‌లో జరిగిన ప్రమాదంలో 14 మంది మరణించిన వార్తపై స్పందించిన ఈమె ఈ వ్యాఖ్యలు చేశారు.  'నేను పోలీసులను వారి పనులు వారు సరిగ్గా చేయడం లేదని అనను. కానీ రోజు రోజుకీ ముంబయిలో జనాభా పెరిగిపోతుండడమే వల్లే అనుకోని విపత్తులు సంభవిస్తున్నాయి. వలస వచ్చే జనం వల్ల నగరం ఇరుకుగా మారిపోతోంది.

ముంబయికి వలస వస్తున్న వారి జనాభాను నియంత్రించడం ఈ రోజు చాలా కష్టసాధ్యమైపోతోంది. అయితే ఈ విషయంపై అధికార యంత్రాంగం ఓ సారి ఆలోచించాలి' అని ఆమె వ్యాఖ్యలు చేశారు. "ప్రతీ నగరానికి ఒక జనాభా పరిమితి అనేది ఉండాలి. ఆ పరిమితి దాటితే వలస వచ్చే జనాలకు వేరే చోటు చూపించడంలో తప్పులేదు' అని ఆమె అభిప్రాయపడ్డారు. 

నటి హేమమాలిని గతంలో కూడా ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలే చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బృందావనం ప్రాంతానికి చెందిన వితంతు గృహాలలో నివసించడానికి వచ్చే బీహార్, బెంగాల్ ప్రాంతాలకు చెందిన అనాథ మహిళల పట్ల ఆమె అభ్యంతరం తెలిపారు. వారు వస్తే.. ఇక్కడి వారి పరిస్థితేమిటని ఆమె అడిగారు. 

ఈ వార్తలు కూడా చదవండి : అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం.. ఊపిరాడక 14 మంది మృతి

Trending News