హిమాచల్ పోల్ : గెలుపు దిశగా కమలం పార్టీ

Last Updated : Dec 18, 2017, 10:02 AM IST
హిమాచల్ పోల్ : గెలుపు దిశగా కమలం పార్టీ

హిమాచల్ లో ఎన్నికల కౌటింగ్ కొనసాగుతోంది. ఆరంభం నుంచే బీజేపీ ముందుంజలో ఉన్న పార్టీ గెలుపు దిశగా పయనిస్తోంది.  కౌంటింగ్ ప్రారంభమైన గంట వ్యవధిలో బీజేపీ ఇంకా మెజార్టీకి రెండు అంకెలకు దూరంగా ఉంది.  ప్రస్తుతం ఆ పార్టీ 33 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా ..కాంగ్రెస్ 10  స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ముందు నుంచి ఇక్కడ బీజేపీ గెలుస్తుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ ఊహాగానాలకు బలం చేకూర్చే విధంగా ఫలితాలు వస్తున్నాయి. దీంతో ఇక్కడ బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

Trending News