అక్కడ హిందువులకు మైనారిటీ హోదా వస్తుందా..!

  

Last Updated : Nov 10, 2017, 03:36 PM IST
అక్కడ హిందువులకు మైనారిటీ హోదా వస్తుందా..!

భారతదేశంలోని పలు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో మిగతా మతాల కంటే తక్కువ జనాభా ఉన్న హిందువులకు  మైనారిటీ హోదా కల్పించాలని బీజేపీ నేత మరియు న్యాయవాది అయిన అశ్వినీ కుమార్  కోర్టులో దాఖలు చేసిన పిల్ పై సుప్రీం కోర్టు స్పందించింది.

ఈ విషయంలో నిర్ణయం తీసుకోనే అధికారమున్న జాతీయ మైనారిటీ కమీషన్ వారిని నేరుగా సంప్రదించాలని తెలిపింది. ప్రస్తుతం మిజోరం, నాగాలాండ్, మేఘాలయ, జమ్ము కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాలతో పాటు లక్షద్వీప్ లాంటి కేంద్రపాలిక ప్రాంతాల్లో హిందువుల సంఖ్య చాలా తక్కువగా ఉంది.

ఈ క్రమంలో ఆయా ప్రాంతాలలో హిందువులకు మైనారిటీ హోదా అవసరమే అని.. లేదంటే వారి హక్కులను హరించడమేనని అభిప్రాయపడ్డారు అశ్విన్ కుమార్. 2011 జనాభా లెక్కల ప్రకారం, ఈ ప్రాంతాల్లో హిందువుల జనాభా ఈ విధంగా ఉంది.

లక్షద్వీప్ (2.5%), మిజోరం (2.5%), నాగాలాండ్ (8.75%), మేఘాలయ (11.53%), జమ్ము కాశ్మీర్ (28.44%), అరుణాచల్ ప్రదేశ్ (29%), మణిపూర్ (31.39%), పంజాబ్ (38.40%) ప్రాంతాల్లో హిందువులు స్వల్ప సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది.

దేశమొత్తం చూసుకుంటే క్రైస్తవ, ముస్లిం, సిక్కుల జనాభా తక్కువే ఉన్నా, కొన్ని రాష్ట్రాల్లో వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉన్న సందర్భాల్లో, ఆయా రాష్ట్రాల్లో హిందువులను మైనారిటీలుగా భావించాలని పిల్ దాఖలు చేసిన అశ్విన్ కుమార్ తెలిపారు. 

Trending News