Maharashtra: మాట వినకపోతే మహారాష్ట్రలో లాక్‌డౌన్ తప్పదని హెచ్చరిక

Maharashtra: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. నిత్యం వైరస్ కేసులు పెరుగుతుండటంతో ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే  తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించకపోతే మరోసారి లాక్‌డౌన్ విధిస్తామన్నారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 14, 2021, 09:26 PM IST
Maharashtra: మాట వినకపోతే మహారాష్ట్రలో లాక్‌డౌన్ తప్పదని హెచ్చరిక

Maharashtra: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. నిత్యం వైరస్ కేసులు పెరుగుతుండటంతో ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే  తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించకపోతే మరోసారి లాక్‌డౌన్ విధిస్తామన్నారు. 

దేశవ్యాప్తంగా మహారాష్ట్ర (Maharashtra) సహా ఐదు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్థితి ఆందోళన కల్గిస్తోంది. ఈ నేపధ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు కచ్చితంగా కోవిడ్ 19 (Covid19 ) నిబంధనలు పాటించాలని సూచించారు. లేనిపక్షంలో కఠినమైన లాక్‌డౌన్ విధించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. లాక్‌డౌన్ (Lockdown)విధించే పరిస్థితి ప్రభుత్వానికి కల్పించవద్దని కోరారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపు తప్పుతుండటంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అన్ని జాగ్రత్తలు, మార్గదర్శకాల్ని పాటించాలని ముఖ్యమంత్రి సూచించారు. 

షాపింగ్ సెంటర్లు, హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ల ప్రతినిధులు హాజరైన వర్చువల్ సమావేశంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray)హెచ్చరించారు. అక్టోబర్ నుంచి సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనప్పటి నుంచి చాలా ప్రాంతాల్లో రద్దీ పెరిగిందని..రక్షణ నియమాల్ని ఖాతరు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగాయన్నారు. లాక్‌డౌన్ అమలు చేయడానికి ప్రభుత్వం అనుకూలంగా లేదని..కానీ తప్పని పరిస్థితులు కల్పించవద్దని కోరారు. స్వీయ క్రమ శిక్షణ, ఆంక్షల మధ్య ఉన్న తేడాను ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. నియమాలు పాటించని కారణంగానే కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందన్నారు. ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకోకుండా ఉండేందుకు సహకరించాలన్నారు. 

ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే హెచ్చరికలు, సూచనల వెనుక వాస్తవ పరిస్థితి ఉంది. మహారాష్ట్రలో నిన్నటికి కొత్తగా 15 వేల కేసులు నమోదయ్యాయి. 88 మంది మరణించారు. మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 22 లక్షలు దాటేసింది. 

Also read: Non-Veg పిజ్జా డెలివరీ, 1 కోటి రూపాయాలు పరిహారం కోరిన మహిళ, అమెరికా ఔట్‌లెట్‌కు నోటీసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News