హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యకుడి కుమార్తె ఇవాంక ట్రంప్ ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకున్నారు. భారత చరిత్రను తాను ఎంతగానో గౌరవిస్తానని పేర్కొన్నారు. ప్రపంచ పారిశ్రమవేత్తల సదస్సు (జీఈఎస్)లో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్న ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇవాంక మాట్లాడుతూ భారత సంస్కృతి, సాంప్రదాయాలంటే తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు. గతంలో విదేశాంగశాఖమంత్రి సుష్మాస్వరాజ్ తో తాను న్యూయార్క్ లో సమావేశమైన సందర్భంలో ఇదే విషయాన్ని చెప్పానని వెల్లడించారు.
పౌరులకు ఆర్థిక స్వావలంబన కల్పించాల్సి ఉంది
పెట్టుబడులకు అవకాశాలను సృష్టించడంతో పాటు పౌరులందరికీ ఆర్థిక స్వావలంబన కల్పించడమే ప్రపంచం ముందు ఉన్న అతిపెద్ద సవాలని పేర్కొన్న ఇవంకా .. భారత్,అమెరికా దేశాలు ఈ విషయంలో ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని వెల్లడించారు. ప్రపంచంలోనే అమెరికా, భారత్ లు అతి పెద్దప్రజాస్వామ్య దేశాలని..ఈ రెండు దేశాల మధ్య భావసారుప్యత ఉందని పేర్కొంటూ.. ఇరు దేశాల మధ్య ఆర్ధిక, రక్షణ, భద్రతా సంబంధాలు మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉందని పేర్కొన్నారు ఇవాంక ట్రంప్.