Assam: పెళ్లి కంటే విధి ముఖ్యం..అందుకే నో లీవ్

కోవిడ్ 19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. కోవిడ్ 19 విధుల్లో బిజీగా ఉన్న ఆ అధికారిణి.. వ్యక్తిగత జీవితం కంటే విధి ముఖ్యంగా భావించారు. వరుడే..వధువు చెంతకొచ్చి పెళ్లి చేసుకున్నాడు.

Last Updated : Sep 14, 2020, 10:35 AM IST
Assam: పెళ్లి కంటే విధి ముఖ్యం..అందుకే నో లీవ్

కోవిడ్ 19 ( Covid19 ) మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. కోవిడ్ 19 విధుల్లో బిజీగా ఉన్న ఆ అధికారిణి.. వ్యక్తిగత జీవితం కంటే విధి ముఖ్యంగా భావించారు. వరుడే..వధువు చెంతకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. 

హైదరాబాద్ ( Hyderabad ) కు చెందిన కీర్తి జల్లి 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. వరుడు పూణేకు చెందిన వ్యాపారవేత్త. కీర్తి ప్రస్తుతం అస్సోం లోని చచర్ జిల్లా డిప్యూటీ కమీషనర్ గా పనిచేస్తూ..కోవిడ్ విధుల్లో బిజీగా ఉన్నారు. బంగ్లాదేశ్ సరిహద్దులోని ఈ జిల్లాలో ఉన్న హైలకండిలో రోజుకు వంద వరకూ కేసులు బయటపడుతున్నాయి. ఈలోగా పెళ్లి తేదీ సమీపించేసింది. సెలవు పెట్టే అవకాశం లేదు. అందుకే వరుడే వధువు చెంతకు అస్సోం చేరుకుని పెళ్లి చేసుకున్నాడు. లేకపోతే సాంప్రదాయం ప్రకారం సెలవు పెట్టుకుని హైదరాబాద్ కు వెళ్లాల్సి ఉంటుంది. కోవిడ్ 19 విధుల్లో ఉన్న ఆమె మనసు దీనికి అంగీకరించలేదు. వరుడే తన బంధువులతో కలిసి సిల్చార్ కు వెళ్లి...కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం క్వారంటైన్  కానిచ్చాడు.  ఆ తరువాత కీర్తి అధికారిక బంగ్లాలో ఎలాంటి హంగూ ఆర్భాటాల్లేకుండా పెళ్లి తంతు మమ అన్పించారు. ఈ ఐఏఎస్ అధికారిణి పెళ్లికి హాజరైంది కేవలం 20 మంది మాత్రమే. వేడుకను జూమ్ వీడియో ద్వారా 8 వందలమంది చూశారు. మరో ముఖ్యమైన అంశమేమంటే..హైదరాబాద్ లో ని కీర్తి తల్లిదండ్రులకు కోవిడ్ పాజిటివ్ ( Covid positive ) గా తేలడంతో ఆమె సోదరి ఒక్కరే పెళ్లికి హాజరైంది. పెళ్లి రోజు కూడా ఫోన్ లో విధి నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించారు. Also read: Parliament: ఎంపీల్లో టెన్షన్.. పలువురు సభ్యులకు కరోనా..?

Trending News