IMD Alert: దేశంలోని ఈ రాష్ట్రాల్లో 4 రోజులు వర్షసూచన, భారీ మంచు

IMD Alert: దేశమంతా వేసవి ప్రతాపం పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎండలు తీవ్రమౌతున్నాయి. అదే సమయంలో పశ్చిమ అవరోధాలు చురుగ్గా ఉండటంతో  దేశంలోని కొన్ని ప్రాంతాలకు వర్షసూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 28, 2024, 05:08 PM IST
IMD Alert: దేశంలోని ఈ రాష్ట్రాల్లో 4 రోజులు వర్షసూచన, భారీ మంచు

IMD Alert: దేశంలో మార్చ్ 29 నుంచి వెస్టర్న్ డిస్ట్రబెన్స్ ఏర్పడనుండటంతో పశ్చిమ హిమాలయ ప్రాంతంపై ప్రభావం పడనుంది. ఫలితంగా ఈ ప్రాంతంలోని రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. అంటే మరో మూడ్రోజులపాటు హిమాలయ ప్రాంతంలో వర్ష సూచన ఉంది. 

హిమాలయాల్లో ఏర్పడనున్న వెస్టర్న్ డిస్ట్రబెన్స్ కారణంగా  మార్చ్ 30, ఏప్రిల్ 1 తేదీల్లో నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కూడా పడే అవకాశాలున్నాయి. ఇక జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో గత 24 గంటల్లో తేలికపాటి వర్షాలు, భారీ మంచు కురిసింది. ఇదే సమయంలో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. ఇక పంజాబ్, హర్యానా, రాజస్తాన్, జార్ఘండ్, ఒడిశా, గంగా తీరం, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలో కూడా మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. 

పశ్చిమ రాజస్థాన్ సమీప ప్రాంతాల్లో వెస్టర్న్ డిస్ట్రబెన్స్ చాలా చురుగ్గా ఉందని తెలుస్తోంది. మార్చ్ 29న హిమాలయ ప్రాంతాన్ని ఆవహించనుంది. ఫలితంగా చాలా ప్రాంతాల్లో వర్షపాతం ఉంటుంది. ముఖ్యంగా పంజాబ్, హర్యానాల్లో మార్చ్ 31 వరకూ వర్ష సూచన ఉంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లో కూడా ఇదే పరిస్థితి.

జమ్ము కశ్మీర్‌లోని పర్వత ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. కానీ చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 5-8 డిగ్రీలు ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైంది. శ్రీనగర్‌లో కనీస ఉష్ణోగ్రత 9.5 డిగ్రీలు కాగా పహల్‌గావ్‌లో 4.7 డిగ్రీలుంది. ఇక గుల్మార్గ్‌లో 3 డిగ్రీలు, లేహ్‌లో 0.5 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు రానున్న 4-5 రోజుల్లో భారీగా మంచు కురవనుందని అంచనా. ఇక రాజస్తాన్, గుజరాత్, కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు నమోదైంది. గుజరాత్‌లోని భుజ్‌లో గరిష్టంగా 41.1 డిగ్రీలు ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. ఇది ఈ సమయంలో సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా ఉంది. 

Also read: Personal Loan Rules: పర్సనల్ లోన్ మంజూరయ్యేందుకు ఎంత సమయం పడుతుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News