మోదీ సర్కార్ పై అన్నాహజారే ఫైర్..!

నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం అయిదు నెలల్లో దాదాపు 80 వేల కోట్ల రూపాయలను విరాళాలుగా సేకరించిందని ఆయన అన్నారు.

Last Updated : Dec 15, 2017, 06:53 PM IST
మోదీ సర్కార్ పై అన్నాహజారే ఫైర్..!

నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం అయిదు నెలల్లో దాదాపు 80 వేల కోట్ల రూపాయలను విరాళాలుగా సేకరించిందని ఆయన అన్నారు. ఈ వార్తలను ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సర్వీస్ అనే సంస్థ ఎప్పుడో వెల్లడించిందని హజారే తెలిపారు. ఈ వార్త ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో కూడా వచ్చిందని ఆయన అన్నారు. అలాగే అవినీతిని పెంచి పోషిస్తున్న దేశాల్లో భారతదేశం ఆసియాలోనే తొలి స్థానం సంపాదించిందని హజారే అభిప్రాయపడ్డారు.

నేను ఇప్పటి వరకూ మౌనంగా ఉన్నానని అనుకోవద్దని.. జనలోక్‌పాల్ బిల్లు కోసం మళ్లీ తాను ఉద్యమిస్తానని..అంతకు ముందు రైతు సమస్యలపై పోరాడేందుకు మార్చి 23, 2018 తేదిన మరో ఉద్యమం ప్రారంభిస్తానని హజారే తెలియజేశారు. రైతుల సమస్యలను పరిగణనలోకి తీసుకొని వారికి ప్రత్యేక వడ్డీ రేట్లను ఆర్బీఐ ఆధ్వర్యంలో అందివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికి తాను కేంద్రానికి ప్రజా సమస్యలపై 32 ఉత్తరాలు రాశానని... కానీ ఒక్కదానికి కూడా తనకు సమాధానం రాలేదని హజారే తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం జన లోకపాల్ విషయంతో చూపించిన అశ్రద్ధ కంటే.. బీజేపీ ప్రభుత్వం చూపిస్తున్న నిరాసక్తత ఇంకా ఎక్కువగా ఉందని ఆయన సర్కార్ పై మండిపడ్డారు. 

Trending News