ఆ మూడు బీజేపీపాలిత రాష్ట్రాలు హస్తగతం; కాంగ్రెస్ ప్రభుత్వాల ఏర్పాటు ఇక లాంఛనమే

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం కైవసం చేసుకుంది  

Last Updated : Dec 12, 2018, 12:43 PM IST
ఆ మూడు బీజేపీపాలిత రాష్ట్రాలు హస్తగతం; కాంగ్రెస్ ప్రభుత్వాల ఏర్పాటు ఇక లాంఛనమే

మధ్యప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు లైక్ క్లియర్ అవడంతో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకున్న రాష్ట్రాల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికే చత్తీస్ గడ్ , రాజస్థాన్ రాష్ట్రాల్లో ఆ పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకొని ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇదే తరుణంలో మధ్యప్రదేశ్ పంచాయితీ కూడా తేలడంతో ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నమైంది. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోయే రాష్ట్రాలన్నీ బీజేపీ పార్టీవే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వారీగా చూసినట్లుయితే పరిస్థితిని ఒక్క సారి పరిశీలిద్దాం...

ఎంపీలో సపోర్టుతో ప్రభుత్వ ఏర్పాటు
మొత్తం 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 116. ఇక్కడ కాంగ్రెస్ కూటమి 115 స్థానాలు సాధించి మ్యాచ్ ఫిగర్ కు ఒకే ఒక్క అడుగుదూరంలో నిలిచింది. అలాగే బీజేపీకి 109 స్థానాలు లభించాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఉత్కంత నెలకొంది. ఈ తరుణంలో చిన్నచితకా పార్టీలతో కాంగ్రెస్ పార్టీ చేసిన సంప్రదింపులు ఫలించాయి. ఆ రాష్ట్రంలో రెండు స్థానాలున్న బీఎస్సీ..ఒకే ఒక్క స్థానం ఉన్న ఎస్పీ ..హస్తానికి మద్దతు ఇచ్చేందుకు మందుకు వచ్చాయి. మరో మూడు స్థానాలున్న ఇరత పార్టీలు కూడా కాంగ్రెస్ పంచన చేరేందుకు సిద్ధపడ్డాయి. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే స్థానాలు కాంగ్రెస్ కూటమికి లభించించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అలాగే గతంలో 15 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్షంలో కూర్చునేందుకు మెంటల్ గా ప్రిమేర్ అవుతోంది

రాజస్థాన్ లో హస్తానికి ఫుల్ మెజార్టీ
మొత్తం 199 స్థానాలున్న రాజస్థాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 100. ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ కుటమికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇక్కడ కాంగ్రెస్ కూటమికి సరిగ్గా 100 స్థానాలు లభించాయి. మరోవైపు బీజేపీ 73 స్థానాలకే పరిమితమైంది. 21 స్థానాల్లో గెలుపు సాధించిన ఇరుతుల్లో మెజార్టీ శాతం కాంగ్రెస్ కు మద్దతించేందుకు ముందుకువచ్చాయి. ముఖ్యంగా ఇక్క ఏడు స్థానాల్లో గెలిచిన బీఎస్పీ..హస్తం పార్టీకి మద్దుతు ప్రకటించింది. దీంతో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవనే చెప్పాలి. తాజా పరిణామాల నేపథ్యలో ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీ రంగం సిద్ధం చేసుకుంటోంది.

ఛత్తీస్‌గఢ్ లో బంపర్ విక్టరీ 
మొత్తం 90 స్థానాలున్న రాజస్థాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 46. ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ కుటమికి ఎలాంటి ఢోకా లేదు. . ఇక్కడ కాంగ్రెస్ కూటమి ఏకంగా 68 స్థానాలు సాధించి తిరుగులేని విజయాన్ని సాధించింది. ఇక్కడ బీజేపీ 15 స్థానాలకే పరిమితమై దారుణ స్థితిలో పడిపోయింది. దీంతో ఇక్కడ చిన్న పార్టీలు మద్దతుతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయగల్గుతుంది. తాజా పరిణామాల నేపథ్యంలొ ఛత్తీస్ గఢ్ లో ప్రభుత్వ ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసుకుంది.  గత 15 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధమైంది.

Trending News