ITR Verification: ఇన్‌కంటాక్స్ శాఖ లెక్కల ప్రకారం జూలై 31 నాటికి 7.28 కోట్ల మంది ఐటీ రిటర్న్స్ పైల్ చేశారు. కానీ ఇప్పటికీ చాలామంది వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ తేదీ నుంచి 30 రోజుల్లోగా వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు చివరి రోజుల్లో అంటే జూలై 27 తరువాత పైల్ చేసి వెరిఫికేషన్ చేయకపోతే కొద్దిరోజులే గడువు మిగిలుంది.
ఇన్‌కంటాక్స్ శాఖ అందించిన వివరాల ప్రకారం జూలై 31 వరకూ 7.28 కోట్టమంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయగా వీరిలో 5 కోట్ల మంది జూలై 26 వరకూ ఫైల్ చేశారు. జూలై 27 నుంచి జూలై 31 వరకూ అంటే చివరి రోజుల్లో 2.28 కోట్లమంది ఫైల్ చేశారు. కొంతమంది రిటర్న్స్ ఫైల్ చేసిన వెంటనే వెరిఫికేషన్ పూర్తి చేయరు. అలాంటివారికి 30 రోజులు గడువు ఉంటుంది. ఒకవేళ మీరు కూడా వెరిఫికేషన్ పూర్తి చేయకుంటే కొద్దిరోజులే గడువు ఉంది. వెరిఫికేషన్ పూర్తి చేయకపోతే రిటర్న్స్ ప్రక్రియ పూర్తి కానట్టే.
ఇన్‌కంటాక్స్ శాఖ నిబంధనన ప్రకారంల ఐటీఆర్ 5 పైల్ చేశాక ఇ వెరిఫికేషన్‌కు 30 రోజుల సమయం ఉంటుంది. ఐటీ నుంచి అందిన లెక్కల ప్రకారం ఇంకా 32 లక్షలమంది వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంది. మరో 19 లక్షలమంది అసలు రిటర్న్స్ ఫైల్ చేయలేదు. మీరు రిటర్న్స్ చివరి రోజుల్లో ఫైల్ చేసి ఉండి..ఇ వెరిఫికేషన్ పూర్తి చేయకుంటే ఆగస్టు 31 వరకూ గడువు ఉంది. ఇది కూడా అందరికీ కాదు. జూలై 27 న రిటర్న్స్ పైల్ చేసుంటే ఆగస్టు 27 వరకూ సమయం ఉంటుంది.
ఐటీ రిటర్న్స్ వెరిఫికేషన్ చేయకుంటే రిఫండ్ రాదు. అంతేకాదు ఆ రిటర్న్స్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో 5000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఒకవేళ మీకు ఇంకా సమయం ఉండి ఉంటే ఇప్పటికైనా తక్షణం వెరిఫికేషన్ పూర్తి చేయండి. లేదా జరిమానాతో మరోసారి రిటర్న్స్ ఫైల్ చేసి ఇ వెరిఫికేషన్, పూర్తి చేయండి.
Also read: Bank Recruitment 2024: బ్యాంకు ఆఫీసర్ ఉద్యోగం కోసం చూస్తున్నారా, ఇదే మంచి అవకాశం, 300 ఖాళీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook