Gas cylinder within two hours : బుక్ చేసుకున్న రెండు గంటల్లోనే సిలిండర్, కొత్త సర్వీస్

Indane Gas offer gas cylinders within two hours of booking : ఇండేన్ గ్యాస్ కొత్త ఆఫర్. బుక్ చేసుకున్న రెండు గంటల్లోనే వినియోగదారులకు సిలిండర్ వస్తుంది. ఒక్క గ్యాస్ సిలిండర్ కలిగి ఉన్న ఇండేన్ గ్యాస్ వినియోగదారుల కోసం ప్రత్యేక సేవ ప్రారంభం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2022, 02:24 PM IST
  • ఇండేన్ గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్
  • ఒక్క గ్యాస్ సిలిండర్ కలిగి ఉన్న ఇండేన్ గ్యాస్ వినియోగదారుల కోసం తత్కాల్ సేవ
  • బుక్ చేసుకున్న రెండు గంటల్లోపే సిలిండర్
Gas cylinder within two hours : బుక్ చేసుకున్న రెండు గంటల్లోనే సిలిండర్, కొత్త సర్వీస్

Indane Gas offer Consumers can get gas cylinders within two hours of booking : చాలా మంది వినియోగదారులు ఒక్క సిలిండర్‌తో ఇబ్బందులుపడుతూ ఉంటారు. అయితే అలాంటి వారికి ఇండేన్ గ్యాస్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఒక్క గ్యాస్ సిలిండర్ (Gas cylinder) కలిగి ఉన్న ఇండేన్ గ్యాస్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా తత్కాల్ సేవ (Tatkal service) సౌకర్యాన్ని ప్రారంభించింది ఇండేన్ గ్యాస్. "ఇండేన్ తత్కాల్ సేవ" పేరుతో (indane gas tatkal booking) ప్రారంభమైన ఈ కొత్త సర్వీస్ కస్టమర్స్‌కు చాలా ప్రయోజనకరంగా ఉంది.

ఇందులో భాగంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న రెండు గంటల్లోనే వినియోగదారులు సిలిండర్ (cylinder) పొందవచ్చు. అయితే తత్కాల్ సేవ సౌకర్యం వినియోగించుకునే వినియోగదారులు అదనంగా రూ.25 చెల్లించాల్సి ఉంటుంది.

ఫోన్‌లో లేదా ఇండేన్ ఆయిల్‌వన్ యాప్‌లో, ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ద్వారా కస్టమర్స్‌ తత్కాల్ సేవలను (Tatkal service) వినియోగించుకోవచ్చు. ఇక హైదరాబాద్‌లో (Hyderabad) మొత్తం 62 ఇండేన్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఈ తత్కాల్ (Tatkal) సౌకర్యం అందుబాటులో ఉంది. 

ఇక మరోవైపు ఇటీవల ఇండేన్ గ్యాస్ (Indane Gas) సంస్థ కాంపోజిట్ సిలిండర్‌ను కూడా ప్రవేశపెట్టింది. తక్కువ ధరకే ఈ సిలిండర్‌ను ఇండేన్ సంస్థ అందిస్తోంది. అయితే ఇది సాధారణ సిలిండర్‌‌ (Cylinder‌‌) మాదిరి ఉండదు.

Also Read : Monkey Drinking Coke: కూల్ డ్రింక్ ఇలా తాగాలిరా బచ్చా.. చూసి నేర్చుకో!

అయితే ఇది మాములు సిలిండర్‌ కంటే కొంచెం తక్కువ బరువుతో ఉంటుంది. దీనిపై ప్లాస్టిక్ (Plastic) తొడుగు ఉంటుంది. మిగిలిన సిలిండర్ల మాదిరిగానే ఈ సిలిండర్ తుప్పు పట్టే అవకాశం ఉండదు. ఈ కాంపోజిట్ సిలిండర్ (Cylinder‌‌) కోసం రూ.633.50 చెల్సించాల్సి ఉంటుంది. ఈ సిలిండర్‌లో పది కిలోల గ్యాస్ పడుతుంది.

Also Read : Ys jagan tweet: చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News