Ys jagan tweet: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేతే చంద్రబాబు నాయుడు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
దేశంలో కరోనా థర్డ్‌వేవ్ పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా సెలెబ్రిటీలు, రాజకీయ నేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇవాళ చంద్రబాబు (Chandrababu)సైతం కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌లో షేర్ చేశారు. స్వల్ప లక్షణాలున్నాయని..అన్ని జాగ్రత్తలతో హోం క్వారంటైన్‌లో ఉన్నానని వెల్లడించారు. గత కొద్దిరోజులుగా తనతో కాంటాక్ట్‌లో వచ్చినవారు పరీక్ష చేయించుకోవాలని సూచించారు.
చంద్రబాబుకు కరోనా సోకిన విషయం తెలియగానే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ys jagan) స్పందించారు. కోవిడ్ నుంచి ఆయన త్వరగా కోలుకుని..ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఈ మేరకు ఇవాళ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
Wishing a speedy recovery & good health for Sri @ncbn garu.
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 18, 2022
Also read: Coronavirus: టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా, క్వారంటైన్‌లో తండ్రీకొడుకులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి